Tirupati News: 20.30 గంటలు.. 203 కిలోమీటర్లు..
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:57 AM
ఓ అంధ విద్యార్థి స్కేటింగ్‌లో అత్యంత ప్రతిభ కనబరిచి పలువురి చేత ప్రశంసలందుకుంటున్నాడు. 20.30 గంటల్లో 203 కిలోమీటర్లు స్కేటింగ్ చేశాడు. కంటి చూపు లేకపోయినా అత్యంత ప్రతిభ కనబరిచిన అతడిని పలువురు అభినందిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.
- స్కేటింగ్‌లో అంధ విద్యార్థి రికార్డు
తిరుపతి: కంటి చూపులేదు. కానీ స్కేటింగ్‌లో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. 20.30 గంటల్లో 203 కిలోమీటర్లు స్కేటింగ్ చేశాడు. సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా నంగిలిలో మొదలైన స్కేటింగ్ యాత్ర.. గంటకు దాదాపు 15 కిలోమీటర్ల వేగంతో సాగింది. మధ్యలో మూడుసార్లు బ్రేక్ తీసుకున్నాడు. ఇలా మంగళవారం వేకువజామున 2.30 గంటలకు వడమాలపేట మండలంలోని ఎస్వీపురం టోల్‌ప్లాజా గమ్యస్థానానికి హర్షవర్ధన్ చేరుకున్నాడు.

మంగళవారం తిరుపతి(Tirupati)లోని శ్రీనివాస క్రీడా సముదాయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. హర్షవర్ధన్ యాత్రను ప్రత్యక్షంగా రికార్డుచేసిన న్యాయనిర్ణేతలు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఏపీ చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి.రామకృష్ణారెడ్డి, జీనియస్ బుక్ ఆఫ్‌రికార్డ్ నుంచి శ్రీనివాసరావు, విశ్వచంద్రారెడ్డి, వజ్రవరల్డ్ రికార్డ్ నుంచి పి.హరిణి ద్వారా ఆ బాలుడికి పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.
పలువురు దాతలు ఆర్థికసాయం అందించారు. మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు. కాపుకార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసుదేవ, తిరుపతి, చిత్తూరు డీఎస్డీవోలు శిశిధర్, ఉదయ్‌భాస్కర్, స్కేటింగ్ కోచ్‌లు ప్రతాప్, ప్రేమ్‌నాధ్, శాప్ కోచ్‌లు లక్ష్మీకరుణ, చక్రవర్తి, హిందూజ, వినోద్, నాగరాజు, గోపీ, సాయిసుమతి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి
Read Latest Telangana News and National News