Home » Tirupathi News
తిరుపతి నగరం దక్షిణ దిశగా విస్తరణకు మార్గం సుగమం కానుంది. నగరానికి దక్షిణంగా ఉన్న పల్లెల ప్రజలకు జాతీయ రహదారిని దాటడం అనే ప్రాణాంతక సమస్యకు పరిష్కారం లభిస్తోంది.
ఏనుగుల దినోత్సవం సందర్భంగా సినీనటి, మిస్ ఇండియా-2020 విజేత మానస వారణాశి మంగళవారం ఉదయం తిరుమల గోశాలకు చేరుకున్నారు. ఏనుగుల ఆశీర్వాదం తీసుకున్నారు.
మగ్రామాన కమల వికాసం జరిగేలా కృషి చేయాలని నేతలు, శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు.
‘హర్‌ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిరుపతిలో వెయ్యి అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.
రాతియుగాన్ని తలపించేలా కొందరు కలిసి దళిత యువకుడైన పవన్‌పై విచక్షణారహితంగా దాడి చేయడం దురదృష్టకరమని ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎ్‌స.జవహర్ అన్నారు.
తిరుపతి జిల్లా పోలీసుల పొదిలోకి ఇటీవల అందిన ఒక సాంకేతిక ఆయుధం డ్రోన్ భిన్న అవసరాలకు ఉపయోగపడే వివిధ సామర్థ్యాలున్న 9 డ్రోన్లు ప్రభుత్వం తిరుపతికి కేటాయించింది. దేశ నలుమూ లల నుంచి వచ్చే జనంలో నేరస్థులు సులువుగా కలగలిసిపోయే అవకాశమున్న ప్రాంతం కావడంతో వీటి అవసరం మరీ ఎక్కువ. అలాగే తరచూ వీవీఐపీల పర్యటనలు, భారీ సభలు జరుగుతుండటంతో క్రౌడ్ కంట్రోల్‌కి కూడా డ్రోన్ల సాయం పోలీసులకు బాగా ఉపయోగపడుతోంది.
సింహం.. అడవికి రారాజు.. ధైర్యసాహసాలకు మారుపేరు. వేటాడటంలో దీని నైపుణ్యమే వేరు. బాల్యంలో కథా వస్తువుగా నిలిచే ఈ మృగరాజు ఆఫ్రికన్ దేశాల్లో హవా చాటుకుంటున్నా మనదేశంలో అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేరిపోయింది.
తిరుపతిలో దళిత యువకుడిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు దారుణంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు శాఖ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది.
వైసీపీ కీలక నేత భూమన అభినయ్ అనుచరుల అరాచకాలు తిరుపతిలో యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తిరుపతి వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అనిల్ రెడ్డి, అతని స్నేహితులు దళిత యువకుడిని చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
గతంలో తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది వైసీపీనేనని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో ఏదో జరిగిపోతుందని భూమన కరుణాకర్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని భానుప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు.