Social Media Case: సీఎం చంద్రబాబు, బాలకృష్ణ టార్గెట్‌గా పోస్టులు.. యువకుడు అరెస్ట్
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:27 PM
సత్యసాయి జిల్లా కదిరికి చెందిన అంజాద్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే..
తిరుపతి: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబం, టిటిడి చైర్మన్ వీఆర్ నాయుడుపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిని తిరుపతి వెస్ట్ పోలీస్‌స్టేషన్ అధికారులు అరెస్ట్ చేశారు.
సత్యసాయి జిల్లా కదిరికి చెందిన అంజాద్ ఖాన్ సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు చేస్తోన్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం హత్యాయత్నం కేసులో కదిరి సబ్ జైలులో ఉన్న అంజాద్ ఖాన్‌ను పిటి వారెంట్ ఆధారంగా తిరుపతికి తరలించారు.
విచారణ అనంతరం, వెస్ట్ పోలీసులు అంజాద్ ఖాన్‌ను కోర్టులో హాజరు చేశారు. వివరాల ప్రకారం, అంజాద్ ఖాన్‌పై హత్యాయత్నం కేసు మాత్రమే కాక, సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు చేసిన 10 కేసులు ఇప్పటికే నమోదు అయ్యి ఉన్నాయి.
Also Read:
వెన్ను నొప్పి తగ్గించుకోవడానికి 8 కప్పలను మింగింది.. తర్వాతేం జరిగిందంటే..
జగన్‌పై దళిత సంఘాల ఆగ్రహం.. పర్యటన అడ్డుకుంటామంటూ..
For More Latest News