Home » Tirumala
తిరుమల వేంకటేశ్వరస్వామి కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే 24 మంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో 17 మంది నిందితుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు.
కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖపట్నానికి గూగుల్ సంస్థ రావడంతో పెద్ద గేమ్ ఛేంజర్గా మారబోతోందన్నారు. ఆంధ్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత ముందుకు పోతుందన్నారు.
తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మార్కెటింగ్ మాజీ జీఎం సుబ్రమణ్యం రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. కల్తీ నెయ్యి గురించి ముందే తెలిసినే కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్న కంపెనీలకే నెయ్యి సరఫరాకు సుబ్రమణ్యం, టీటీడీ ఉన్నతాధికారులు అవకాశం కల్పించారని రిమాండ్ రిపోర్టులో సీబీఐ సిట్ పొందుపర్చింది.
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో పూర్తిగా విద్యుత్ బస్సులను వినియోగంలోకి తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇప్పుడున్న డీజల్, పెట్రోల్ ట్యాక్సీలు, టీటీడీ అద్దెవాహనాలను దశలవారీగా రద్దు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ పెంచేలా పనిచేశాను తప్ప.. దేవుడి విషయంలో ఏ తప్పు చేయలేదని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. స్వామి వారి లడ్డూ ప్రసాద విషయంలో తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
భూమన కరుణాకర్ రెడ్డిపై భాను ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరుణాకర్ పిట్ట కధలు చెప్పారంటూ వ్యాఖ్యలు చేశారు.
కలియుగ వైంకుఠ నాథుడు తిరుమల వేంకటేశ్వరస్వామిని ప్రపంచవ్యాప్తంగా భక్తులు పూజిస్తుంటారు. క్షణకాలమైనా నిత్య అలంకార ప్రియుడు శ్రీవారి దర్శనం దొరికితే చాలని భక్తులు భావిస్తుంటారు.
తమిళనాడు రాష్ట్రాని చెందిన ఓ వాహనంపై అన్యమత చిహ్నాలు ఉండటాన్ని గుర్తించారు. అయితే.. ఈ వాహనం అలిపిరి టోల్గేట్ దాటి తిరుమల కొండపైకి చేరుకోవడం గమనార్హం. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఒకరిని విధుల నుంచి తొలగించింది.
తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ముర్ముకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.
పరకామణి చోరీ కేసుని ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ క్రమంలో కేసుపై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.