Home » TG Politics
తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకత్వం పక్కదారి పడుతోందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. రోడ్లపై మాట్లాడటం, ధర్నాలు చేయడం కాకుండా అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తాము సమాధానం చెబుతామన్నారు.
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరిగితే 117 సీట్లలో గెలుస్తామని, సీట్లు పెరగకపోతే 97 సీట్లతో కాంగ్రెస్ గెలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగానే భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖను బీఆర్ఎస్‌లోకి రానివ్వమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లో ఎక్కడా వర్గ పోరు లేదని తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. నేతలు అందరం కాంగ్రెస్ బలోపేతం కోసమే పని చేస్తున్నామని పేర్కొన్నారు.
రైతుల జీవితాలతో సీఎం రేవంత్‌రెడ్డి ఆడుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాజకీయాల్లో కవిత వ్యాఖ్యలు మరోసారి హీట్ పెంచాయి. సీఎం కావాలన్న తన ఆకాంక్షను బహిరంగంగా వెల్లడించిన ఆమె.. ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హరీశ్‌రావు భార్య తనపై పోటీ చేస్తే స్వాగతిస్తానని చెప్పడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు కొండా కుటుంబం దారెటన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.
‘పదవి ఉన్నా లేకున్నా నా గౌరవం నాకు ఉంది’’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డిని గురువారం తప్పించింది.
మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్ కావడం.. ఆమె స్వయంకృతాపరాధమేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పార్టీ, ప్రభుత్వం ఆమెకు అనేక అవకాశాలిచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.