Home » Telugu Desam Party
ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడును మరింత విజయవంతం చేద్దామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు సూచించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ , ఆయన సాక్షి మీడియా చేస్తున్న కుట్రలన్నీ విఫలమవుతోండటంతో ఇప్పుడు నిరుద్యోగులలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నంగనాచిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పులివెందులకు చెందిన టీడీపీ నేత పేర్ల పార్థసారథి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రిలయన్స్ ఆస్తులను ధ్వంసం చేయలేదా? అని ప్రశ్నించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రౌడీషీట్ ఉందని విమర్శించారు.
సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో టీడీపీని సమన్వయ సమస్య వేధిస్తోంది.
తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో మహానాడు నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో మహానాడు వేదికగా చేపట్టాల్సిన తీర్మానాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపై విస్తృతంగా చర్చించారు.
విజయనగరం నగర రాజకీయాల్లో ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతూ.. నగరంలోని 4వ డివిజన్‌కు చెందిన సుమారు 200 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కుటుంబాలు అధికారికంగా టీడీపీ గూటికి చేరాయి.
మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యను అడ్డంపెట్టుకొని నాని బతికిపోయారని విమర్శించారు.
మహానాడు రద్దుపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాలతో ఇంధన వనరులు ఆదా చేసుకునే నేపథ్యంలో భాగంగా నెల్లూరులో జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని రద్దు చేశామని తెలిపారు.