Share News

CM Chandrababu Naidu: ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 09 , 2025 | 09:37 PM

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. అంతకు ముందు పాడేరు మండలం వంజంగిలో వనదేవత మోదకొండమ్మను దర్శించుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడమని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

CM Chandrababu Naidu: ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అల్లూరి సీతారామరాజు జిల్లా: అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లగిశపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడిన సీఎం మళ్లీ జన్మ ఉంటే ఇక్కడే పుట్టాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమం అనంతరం పర్యటనపై ఎక్స్ వేదికగా పలు విషయాలను ఆయన పంచుకున్నారు.


ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. అంతకు ముందు పాడేరు మండలం వంజంగిలో వనదేవత మోదకొండమ్మను దర్శించుకుని ఏపీ సుభిక్షంగా ఉండేలా చూడమని కోరుకున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలోని గిరిజన సోదరులు సాగు చేసే కాఫీ తోటకు వెళ్లి వారితో మాట్లాడి సాగు విధానం, ఆదాయం గురించి తెలుసుకున్నాని వివరించారు. కాఫీ రైతులతో కలిసి తోటల మధ్య అద్భుతమైన అరకు కాఫీ రుచి చూశానని తెలిపారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని రానున్న రోజుల్లో ఏజెన్సీలో చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు వివరించినట్లు సీఎం స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు

పులివెందుల ఎన్నికలో వైసీపీ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారు: బీటెక్ రవి

Updated Date - Aug 09 , 2025 | 09:58 PM