• Home » Telangana

Telangana

కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు ఇవే..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు ఇవే..

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 27, వంకాయ 35, బెండకాయ 45, పచ్చిమిర్చి 45, బజ్జిమిర్చి 35, కాకరకాయ 35, బీరకాయ రూ.40లకు విక్రయిస్తున్నారు.

హైదరాబాద్‌లో నేడు విద్యుత్‌ కోత.. ఈ ప్రాంతాల్లో పవర్‌ కట్

హైదరాబాద్‌లో నేడు విద్యుత్‌ కోత.. ఈ ప్రాంతాల్లో పవర్‌ కట్

హైదరాబాద్ నగరంలోని ఆయా ఏరియాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్‏కో అధికారులు తెలిపారు.

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి

ప్రజావాణి దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ బి.శ్రీరాములు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

కేసీఆర్‌ సీఎం కావాలని పాదయాత్ర

కేసీఆర్‌ సీఎం కావాలని పాదయాత్ర

రాష్ట్రంలో కొనసాగుతున్న నియంతపాలన పోవాలని, సీఎంగా కేసీఆర్‌ మళ్ళీ రావాలని, మంథనిలో పుట్ట మధు ఎమ్మెల్యే గెలుపొందేలా ప్రజలు ఆశీర్వదించాలని భూపాల పల్లి మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ శ్రీహర్షిని, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌లు అన్నారు.

పుష్కరాల పనులు వేగవంతం చేయాలి

పుష్కరాల పనులు వేగవంతం చేయాలి

గోదావరినది పుష్కరాల సం దర్భంగా చేపట్టనున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమ యంలోగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం మంథనిలో కలెక్టర్‌ పర్యటించి గోదావరి పుష్కర ఘాట్లు, గౌతమేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులు, పుష్కరాల కోసం చేపట్టాల్సిన భూసేకరణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఎన్నికల కమిషన్‌ తీరుపై కాంగ్రెస్‌ ధర్నా

ఎన్నికల కమిషన్‌ తీరుపై కాంగ్రెస్‌ ధర్నా

జాతీయ ఎన్నికల కమిషన్‌ తీరును నిరసిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

అసెంబ్లీకి వెళ్లిన దానికంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా: సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీకి వెళ్లిన దానికంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అనేకసార్లు జైలుకు పంపారని పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ‘ది కాన్‌క్లేవ్ 2026’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్‌..

ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్‌..

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఖాళీ అయినట్లు అధికారికంగా ప్రకటించే గెజిట్ నోటిఫికేషన్‌ను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి జారీ చేశారు. సెప్టెంబర్ 26న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

చేతబడి చేస్తోందనే అనుమానంతో వృద్ధురాలిపై దాడి

చేతబడి చేస్తోందనే అనుమానంతో వృద్ధురాలిపై దాడి

చేతబడి చేస్తోందనే అనుమానంతో వృద్ధురాలిపై దాడి చేసిన ఘటన జిల్లాలోని మంచాల మండలంలో జరిగింది. నోముల గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే 60 ఏళ్ల వృద్ధురాలు చేతబడి చేస్తోందనే నెపంతో గ్రామస్థులు దాడి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి