Share News

kumaram bheem asifabad- ఉపాధి.. రూపు మారింది

ABN , Publish Date - Jun 30 , 2026 | 10:31 PM

నిరుపేదలకు పనులు కల్పించ డమే లక్ష్యంగా గత యూపీఏ ప్రభుత్వం రూపకల్పన చేసిన మహత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి మీమీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) జూలై 1 నుంచి కొత్తరూపు దిద్దుకోబోతుంది. కేంద్ర ప్రభుత్వం వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజివిక మిషన్‌ గ్రామీణ్‌(వీబీజీరామ్‌జీ) పథకం పేరుతో అమలు కాబోతుంది. దే

kumaram bheem asifabad- ఉపాధి.. రూపు మారింది
లోగో

- ఇకపై 125 రోజుల పని దినాలు

- కొత్త నిబంధనల అమలుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు పనులు కల్పించ డమే లక్ష్యంగా గత యూపీఏ ప్రభుత్వం రూపకల్పన చేసిన మహత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి మీమీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) జూలై 1 నుంచి కొత్తరూపు దిద్దుకోబోతుంది. కేంద్ర ప్రభుత్వం వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజివిక మిషన్‌ గ్రామీణ్‌(వీబీజీరామ్‌జీ) పథకం పేరుతో అమలు కాబోతుంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న మార్పుల్లో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కూడా కొత్త నిబంధనలకు అనుగుణంగా గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని అవలు చేసేందుకు కార్యాచరణ సిద్దం చేస్తోంది.

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లాలో 85వేల జాబ్‌కార్డులు 1.54 లక్షల మంది కూలీలకు గాను గతేడాది జిల్లాకు 31.67 లక్షల పనిదినాల లక్ష్యాన్ని విధించగా ఇప్పటి వరకు కేవలం 20.28 లక్షల పనిదినాలు మాత్రమే కల్పిం చారు. ఇంకా 11.39 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉంది. ఈసారి వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉండటంతో పనులు మంద కొడిగాసాగాయి. గ్రామై ఖ్య సంఘాల భవన నిర్మాణాలు ఆలస్యంగా ప్రారం భించడం, రోడ్లు తదితర పనులు మందకొడిగా సాగుతు న్నాయి. కాగా మెటీరియల్‌ కంపోనెంట్‌ నిధులు సకాలంలో విడుదల కాక పోవడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ నిధుల ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, గ్రామైఖ్య సంఘం, పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టారు. ఇప్పటి వరకు 70 శాతం మేర పనులు పూర్తయినట్లు సమాచారం. బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యంతో 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవడం అధికారులకు సవాలుగా మారింది.

- పథకంలో మార్పులు ఇలా..

నూతన చట్టం ప్రకారం పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. గతంలో కేంద్ర ప్రభుత్వమే ఉపాధి పనులకు 100 శాతం నిధులు కేటాయించేది. కానీ కొత్త పథకంలో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను భరించాల్సి ఉంటుంది. దీనివల్ల రాష్ట్ర బడ్జెట్‌పై అదనపు భారం పడనుంది. గతంలో 263 రకాల పనులకు మాత్రమే అనుమతి ఉండగా నూతన పథకంలో ఆ సంఖ్యను 318కి పెంచారు. గతంలో నీటిపారుదలశాఖ ఆదీనంలో ఉండే చెరువుల పూడికతీత పనులను ఉపాధిహామీ కింద చేసేవారు. ఇకపై ఆ నిర్వహణ ఖర్చులను నీటిపారుదలశాఖే భరించాల్సి ఉంటుంది.

అమలుకు సర్వం సిద్ధం..

- దత్తారావు, డీఆర్‌డీవో

ఉపాధి హామీ పథకంలో కొత్త నిబంధనల అమలుకు సర్వం సిద్ధం చేస్తున్నాం. జూలై 1 నుంచి వీబీజీ రామ్‌జీ పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఉన్నతాధికారులతో కలెక్టర్‌ తగిన సూచనలు చేశారు. పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందుకు అనుగుణంగా సిబ్బందిని సిద్ధం చేశారు. ఆయా గ్రామాల్లో పథకంలో మార్పులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.

Updated Date - Jun 30 , 2026 | 10:31 PM