Share News

kumaram bheem asifabad- తాగునీటి సరఫరాకు నిధులు మంజూరు

ABN , Publish Date - Jun 30 , 2026 | 10:37 PM

కాగజ్‌నగర్‌ తాగునీటి సరఫరాకు రూ.31.70 కోట్లు మంజూరైనట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు తెలిపారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలొ మంగళవారం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.

kumaram bheem asifabad- తాగునీటి సరఫరాకు నిధులు మంజూరు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే హరీష్‌బాబు, పాల్గొన్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహిన్‌ సుల్తానా

కాగజ్‌నగర్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ తాగునీటి సరఫరాకు రూ.31.70 కోట్లు మంజూరైనట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు తెలిపారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలొ మంగళవారం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో తాగునీటి సరఫరా కోసం యూడీఎఫ్‌ఐ కింద రూ.31.70 కోట్టు మంజూరు చేయించామని చెప్పారు. దీంతో పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టనున్నామని వివరించారు. వీటితోపాటు అదనంగా అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ కింద అండర్‌ గ్రౌండ్‌ డైనేజీ కోసం నిధులు సేకరించనున్నామని తెలిపారు. పారిశుధ్యం విషయంలో పట్టణ ప్రజలు శానిటేషన్‌ సిబ్బందికి పట్టణ ప్రజలు శానిటేషన్‌ సిబ్బందికి సహకరించాలన్నారు. లేని పక్షంలో రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎనిమిది మంది శానిటేషన్‌ సిబ్బంది పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహిన్‌ సుల్తానా, కమిషనర్‌ తిరుపతి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 10:37 PM