kumaram bheem asifabad- బీఆర్‌ఎస్ నాయకుల రాస్తారోకో
ABN , Publish Date - Jun 30 , 2026 | 10:39 PM
బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు భధ్రతను రాష్ట్ర ప్రభుత్వం తొలగించడిన్ని నిరసిస్తూ మంగళవారం కాగజ్‌నగర్ బస్టాండు వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపై కక్ష్య సాధింపుకు పాల్పడుతుందన్నారు.
కాగజ్‌నగర్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు భధ్రతను రాష్ట్ర ప్రభుత్వం తొలగించడిన్ని నిరసిస్తూ మంగళవారం కాగజ్‌నగర్ బస్టాండు వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపై కక్ష్య సాధింపుకు పాల్పడుతుందన్నారు. భద్రతను తొలగించడం దారుణమన్నారు. సీఎం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, సర్పంచ్‌లు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు భద్రత తొలగించడాన్ని నిరసిస్తూ మంగళవారం సిర్పూరు(టి) ప్రధాన రోడ్డుపై బీఆర్‌ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. కార్యక్రమంలో నాయకులు సారయ్య, అమీరుద్దీన్, నరేందర్, తిరుపతిగౌడ్, ఖాజామోయినోద్దీన్, తిరుపతి, శ్రీనివాస్, మల్లేష్, మోహన్ పాల్గొన్నారు.
చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ భద్ర తను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడంపై బీఆర్‌ఎస్ నాయకులు మండల కేంద్రంలోని శివాజీ చౌర స్తా వద్ద ప్రధాన రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సత్య నారా యణ, వెంకటేష్, లాంచు, నాజీమ్‌హుస్సేన్, శ్రీమన్నారాయణ, శేఖర్ పాల్గొన్నారు.