Share News

kumaram bheem asifabad-వివరాలు పక్కాగా నమోదు చేయాలి

ABN , Publish Date - Jun 30 , 2026 | 10:33 PM

ఓటరు జాబితా సవరణలో వివరాలు పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్‌ కె.హరిత తెలిపారు. సిర్పూరు(టి)లో మంగళవారం కలెక్టర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటరు నమోదు చేసే ఎన్యూమరేషన్‌ ఫారాలను సక్రమంగా చూసుకొని తీసుకోవాలన్నారు. ఓటర్లు ఎలాంటి సందేహాలుంటే నివృత్తి చేయాలన్నారు. బీఎల్‌ఓలు చేసిన అంశాలపై తహసీల్దార్‌ రహీమోద్దీన్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

kumaram bheem asifabad-వివరాలు పక్కాగా నమోదు చేయాలి
వరాలు అడిగి తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్‌ కె.హరిత

సిర్పూరు(టి), జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా సవరణలో వివరాలు పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్‌ కె.హరిత తెలిపారు. సిర్పూరు(టి)లో మంగళవారం కలెక్టర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటరు నమోదు చేసే ఎన్యూమరేషన్‌ ఫారాలను సక్రమంగా చూసుకొని తీసుకోవాలన్నారు. ఓటర్లు ఎలాంటి సందేహాలుంటే నివృత్తి చేయాలన్నారు. బీఎల్‌ఓలు చేసిన అంశాలపై తహసీల్దార్‌ రహీమోద్దీన్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తప్పులు లేకుండా ఫారాలు నింపేలా చూడాలన్నారు. బీఆర్‌ఎస్‌ మాజీ సర్పంచ్‌ సయ్యద్‌ కిజర్‌ హుస్సెన్‌, దుర్గం విక్రంతో పాటు మరి కొందరు సిర్పూరు(టి) మండలం నుంచి ఇసుక, మొరం అక్రమంగా తరలిస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్‌ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో కోట ప్రసాద్‌, ఈవో తిరుపతి, ఎమ్మారై స్వప్న, బీఎల్‌వోలు తదితరులు ఉన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో వద్యార్థులు వంద శాతం హాజరయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ కె.హరిత తెలిపారు. మంగళవారం కాగజ్‌నగర్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాల, జ్యోతి బాపూలే, గురుకుల పాఠశాలలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. అలాగే మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. వివిధ అంశాలపై చక్కటి బోధన చేయాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 10:33 PM