Home » Telangana Police
జవహర్‌నగర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యాపారి హత్యకు కారణమైన వారిని పోలీసులు పట్టుకున్నారు. ఒక మైనర్ బాలుడుతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు.
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఈ సంవత్సరం సుమారు 20కు పైగా ఫేక్ బెదిరింపు కాల్స్, మెసేజెస్ వచ్చాయని శంషాబాద్ డీసీపీ రాజేశ్ తెలిపారు. ఫేక్ కాల్స్ మెయిల్స్‌పై దర్యాప్తు స్పీడ్ అప్ చేశామని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాలాగూడ పీఎస్ పరిధి లాలాపేటలో డివైడర్‌ను కారు అత్యంత వేగంతో వచ్చి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు యువకులు ఉండగా...
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసుపై నాంపల్లి కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. నిందితుడు రవిని మూడోసారి కస్టడీకి అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే మరో నాలుగు కేసుల్లో కస్టడీ కోరుతూ పోలీసులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
ప్రేమించి మోసపోయానని గ్రహించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా దొంచందకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి, ఏరుగట్లకు చెందిన ఓ యువతితో ఆరేళ్లుగా ప్రేమలో పడ్డారు. ఇరువురూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.
తెలుగు సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మది రవినీ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రెండోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని గురువారం విచారణ చేశారు.
తెలంగాణలో ఇటీవల ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. వరుస ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మహబూబ్‌నగర్‌లో జరిగిన ఘటనలో ఇథనాల్ ట్యాంకర్ డ్రైవర్ మృతిచెందాడు.
ఐబొమ్మ రవిని గత నాలుగు రోజులుగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో పోలీసులకు రవి సరిగా సహకరించడం లేదనే వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్ నగర భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి త్వరితగతిన స్పందించే విధంగా పోలీసు బృందాలు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.