Home » Telangana Chief Minister
కేరళం ముఖ్యమంత్రిగా ఎంపికైన వీడీ సతీశన్‌కు తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కేరళం ప్రజలకు దశాబ్దాలుగా సేవ చేస్తూ... విలువలతో కూడిన రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపు అని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో మెగా గ్రోత్ కారిడార్‌పైన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జూబ్లీహిల్స్ నివాసంలో ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దారా ఖోస్రోషాహి బుధవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
తెలంగాణలో నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలబట్టడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం తప్పనిసరి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ హక్కుల కోసం తాము కేంద్రంతో పోరాడుతామని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. 2047 పాలసీ డాక్యుమెంట్ రూపొందించామని పేర్కొన్నారు
దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని ఉద్ఘాటించారు.
తుమ్మిడిహెట్టిపై బ్యారేజీ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 150 మీటర్ల ఎత్తుతో కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది.బ్యారేజి నిర్మించి నేరుగా ఎల్లంపల్లికి గ్రావీటీతో జలాలను తరలించేందుకు యోచిస్తోంది
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీన పర్యటించే అవకాశాలు ఉన్నాయి.
మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల కన్నీటి చుక్కలే నాగరికత చరిత్రకు సిరా అని అభివర్ణించారు.