Home » Telangana Assembly
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆదివారం హడావుడిగా చర్చ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఏంటో అర్థమైందని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. కేసీఆర్‌కు, తనకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 8బీ కింద నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. 8బీ కింద నోటీసులు ఇవ్వకపోతే రిపోర్టు చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందని మాజీ మంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు.
కేబినెట్ అనుమతి లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్లిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం పూర్తి చేయడానికి రూ.లక్షా 27 వేలకోట్లు అవసరమని పేర్కొన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష ఎకరాల కొత్త ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేదని వెల్లడించారు. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ నాలుగేళ్లలోనే కూలిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ మెుదలైంది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ల కుంగుబాటు, లోపాటులపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై లఘుచర్చ జరుగుతోంది.
తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సుదీర్ఘ చర్చల అనంతరం.. బీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పలికింది. అన్ని పార్టీలు బీసీ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. దీంతో రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు త్వరలో కార్యరూపం దాల్చనుంది.
బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని కేటీఆర్ తెలిపారు. చట్టసభల్లోనూ రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశామన్నారు. బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలని ఆయన సూచించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రోజుకో మాట మాట్లాడుతోందని విమర్శించారు.
అసెంబ్లీలో కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్ యాక్ట్ 285Aను సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాల సవరణ బిల్లులతోపాటు కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్‌ను నివేదికను ఒకే సారి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని శాసనసభ బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
Telangana Assembly Sessions 2025 Live Updates in Telugu: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఇచ్చిన నివేదిక సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది ఆంధ్రజ్యోతి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపం తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. చూడటానికి క్లాస్‌గా కనిపించే ఆయన మాస్ లీడర్ అని.. నాకు మంచి మిత్రుడని గుర్తుచేసుకున్నారు.
ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రకారం..