Home » TDP
అక్రమ ఇసుక రగిల్చిన చిచ్చు టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులతో వెళ్లి టీడీపీ కార్యకర్త ఇంటిని ముట్టడించడం ఘర్షణకు మరింత ఆజ్యం పోసింది.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్.. చంద్రబాబు కోట్టేస్తున్నారంటూ వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు.
ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైన అంశంపై టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు వివరణతో పార్టీ అధిష్ఠానం సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. సమన్వయ లోపం వల్లే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొంది.
అంగన్వాడీల విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలోనే అంగన్వాడీలకు అమ్మఒడి పథకం అందలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం అమలు చేసిందని తెలిపారు.
‘నేను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు.. భవిష్యత్తులో కూడా దాటను' అని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు వివరణ ఇచ్చారు. తాను కేవలం ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరయ్యాయని, తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నేటి నుంచి ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ప్రారంభించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు.
టీడీపీ కార్యకర్తలకు మంత్రి నారా లోకేశ్ కీలక హామీ ఇచ్చారు. పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించే కార్యకర్తల క్షేమమే తమకు ప్రాధాన్యమని, వారి ఆరోగ్య భద్రత బాధ్యత పూర్తిగా తమదేనని స్పష్టం చేశారు.
వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ అధ్యక్షుడి నుంచి దిగువస్థాయి నాయకుడి వరకూ అక్రమాలు, అరాచకాలు చేశారని ఆరోపించారు.
నెల్లూరు జిల్లా కావలి మండలం తాగేటివారిపాలెంలో టీడీపీ కార్యకర్త చాట్ల వాసు హత్య రాజకీయంగా కలకలం రేపింది. ఇటీవల జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.