Palle Raghunath Reddy: మాజీమంత్రి ‘పల్లె’ సంచలన కామెంట్స.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:31 AM
మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకుడు శ్రీధర్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పుట్టపర్తిలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే ఆయన అలా మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు.
- అభివృద్ధిని ఓర్వలేక శ్రీధర్‌రెడ్డి ఆరోపణలు
- విజిలెన్స్ విచారణకు సిద్ధం: మాజీ మంత్రి పల్లె
పుట్టపర్తి(సత్యసాయి): సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలను మునుపెన్న డూ లేని విధంగా ఘనం గా నిర్వహించామని, ఈ సందర్భంగా పుట్టపర్తిలో జరిగిన అభివృద్దిని చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకుడు శ్రీధర్‌రెడ్డి(Sridhar Reddy) అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి(Palle Raghunath Reddy) అన్నారు. అభివృద్ధి పనుల్లో అవకతవకలుంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, విజిలెన్సుతో విచారణ చేయంచడానికి సిద్దంగా ఉన్నామని శ్రీధర్‌రెడ్డికి సూచించారు.
ఆయన బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సత్యసాయి శతజయంతి ఉత్స వాల సందర్భంగా పట్టణంలో నిర్మించిన మరుగుదొడ్ల విషయంలో కుంభకోణమంటూ శ్రీధర్‌రెడ్డి హడావుడి చేస్తున్నారన్నారు. పుట్టపర్తి అభి వృద్ధిని అడ్డుకోవడమే శ్రీధర్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత ఆర్టీసీ డిపో, శిశుసంక్షేమ హాస్టళ్లు, పంచాయతీ ఇంజనీ రింగ్ కార్యాలయాలు సగం పట్టణంలోని ఇరిగేషన్ ల్యాండ్‌లోనే ఎన్నాళ ్లగానో ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఇరిగేషన్ ల్యాండ్‌లో కొ త్తగా శాశ్వత నిర్మాణాలను ఎక్కడైనా నిర్మించి ఉంటే చూపాలన్నారు.

మున్సిపల్ చైర్మన్ ఓబుళపతి అభివృద్ధిని కోరుకునే మంచినాయకుడని, ఆయన్ను బెదిరిస్తున్నారని చెప్పడం పూర్తిగా అసత్యమన్నారు. అలాంటి సంస్కృతి మాది కాదని, మేం ప్రజాసేవ మాత్రమే చేస్తామన్నారు. పుట్ట పర్తి ఆభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఆపకపోతే ప్రజలే శిక్షిస్తారన్నారు. పుట్టపర్తి ప్రశాంతతను అడ్డుకునే అసాంఘిక శక్తులపై పోలీసులు ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తున్నారన్నారు. పద్ధతి తప్పి మాట్లాడడం, తప్పుదారి పట్టించడం మానుకోవాలని హితవు పలికారు. 2029 ఎన్నికల్లో మీఆడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
2030 నాటికి అమెజాన్ ఇండియా రూ.3.15 లక్షల కోట్ల పెట్టుబడులు
3 నెలల్లో తుమ్మిడిహెట్టి డీపీఆర్
Read Latest Telangana News and National News