Buddha Venkanna Comments on Jagan: పరకామణి విషయంలో జగన్ వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న ఫైర్..
ABN , Publish Date - Dec 07 , 2025 | 08:06 PM
పరకామణి విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. లక్షల కోట్లు దోచుకున్న జగన్‌కు ఇది చిన్న తప్పే కావచ్చని వ్యంగాస్త్రాలు సంధించారు. వైకాపా నేత పేర్ని నానికీ కౌంటర్ ఇచ్చారు.
అమరావతి, డిసెంబర్ 07: పరకామణి విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న(TDP Leader Buddha Venkanna) మండిపడ్డారు. పరకామణి(Parakamani) కేసు చాలా చిన్నదని జగన్ చెప్పడంలో ఆశ్చర్యం లేదన్న బుద్దా.. లక్షల కోట్ల రూపాయలను దోచుకున్న జగన్‌కు ఇది చిన్న తప్పేనని వ్యంగాస్త్రాలు సంధించారు. తాను చాలా పెద్ద తప్పు చేశానని నిందితుడు రవికుమార్(Ravi Kumar) స్వయంగా ఒప్పుకున్నాడని కానీ, మాజీ సీఎం మాత్రం చిన్న తప్పు అన్నాడంటే వెంకన్న అంటే ఎంత ప్రేమ ఉందో ప్రజలకు అర్థమవుతోందని విమర్శించారు.
'రవికుమార్‌ను జగన్ ఎందుకు వెనుకేసుకు వస్తున్నాడు?. గతంలో తిరుమల(Tirumala)కు జగన్ వెళ్లింది భక్తి కోసమో, సీఎం హోదా కోసమో కాదు.. రవికుమార్ వివాదాన్ని అడ్డం పెట్టుకుని దోచుకోవడానికే. వ్యాపారం చేసే రవికుమార్‌కు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి?. తాడేపల్లి ప్యాలెస్(Tadepalli Palace) వేదికగా సెటిల్‌మెంట్ జరిగింది. భగవంతుడి సొమ్ము దోచుకున్న వారిని వైసీపీ అధినేత వెనుకేసుకొస్తున్నారు. లక్షల కోట్లు దోచుకుని జైలుకు వెళ్లిన జగన్‌కు ఇదంతా చిన్న విషయమే. ఇప్పుడు తన విషయం బయటకు వస్తుందని రవికుమార్‌ను హత్య చేస్తారనే అనుమానాలూ ఉన్నాయి. జగన్ వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. రవికుమార్ నుంచి ఎవరెవరు ఎంత ఆస్తులు రాయించుకున్నారో తేలాలి. చిన్న తప్పయితే కోట్ల రూపాయల ఆస్తులు ఎందుకు రాయించుకున్నారు?' అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న.
సీఎం చంద్రబాబు (Chandrababu), ఆయన కుటుంబ సభ్యులపై మాజీ సీఎం నీచంగా మాట్లాడుతున్నాడంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు వెంకన్న. 'భారతి(Bharathi) గారి లాగా.. భువనేశ్వరి(Bhuvaneswari) గారు రాజకీయాల్లో లేరు. మీ కుటుంబంలా వాళ్లు అక్రమంగా దోచుకోలేదు' అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కుటుంబం ప్రజలను బాగు చేస్తుందే తప్ప.. ఆస్తుల కోసం వెళ్లగొట్టదని జగన్‌కు చురకలంటించారు. చంద్రబాబుది అందరనీ కలుపుకుని ఆప్యాయత పంచే స్వభావమని ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నారు. బాబాయ్‌ని చంపిన వారిని పక్కన పెట్టుకుని కాపాడిన చరిత్ర నీదని జగన్‌పై మండిపడిన టీడీపీ నేత.. ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని అమ్మను, చెల్లిని బయటకు గెంటేశాడని అక్కసు వెళ్లగక్కారు. తన, మన భేదాలు చూడకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే కుటుంబం భువనేశ్వరి వాళ్లదని.. జగన్‌కు సిగ్గు, శరంలేదు కాబట్టే అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు.'రవికుమార్ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది. తాడేపల్లి ప్యాలెస్‌కు ఉన్న లింకులు త్వరలోనే తేలుతాయి. మోకాళ్లమీద కూర్చుని ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలి. ఇంకోసారి అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారు' అని టీడీపీ నేత అన్నారు.
పేర్ని నానిపైనా..
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. సచ్చీలుడిలాగా పేర్ని నాని తన గురించి తాను గొప్పలు చెబుతున్నారని ఫైర్ అయిన వెంకన్న.. భార్యను అక్రమ బియ్యం కేసులో ఇరికించిన వ్యక్తి అంటూ విమర్శించారు. ఆ తల్లిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ నాని దర్జాగా తిరుగుతున్నాడన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌పై పేర్ని నాని నోరు పారేసుకోవడంపై తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు బుద్ధా. 'పేదల బియ్యం బొక్కేసిన నువ్వా నీతులు చెప్పేది. నీ జీవితమే పెద్ద వ్యంగ్యం.. నీది నువ్వు చూసుకో.. ఇంకోసారి పిచ్చివాగుడు వాగితే నీ సంగతి చూస్తాం. పేర్నీ నాని.. నోరు అదుపులో పెట్టుకో.. సూక్తులు మానుకో.. ముందు నీ ఇంట్లో వాళ్లను కేసులో ఇరికించినందుకు లెంపలు వేసుకో' అని హితవు పలికారు.
ఇవీ చదవండి:
హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు: విజయసాయిరెడ్డి
ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఈఓ చేతివాటం.. చివరకు.?