Kadiri Temple Theft: ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఈఓ చేతివాటం.. చివరకు.?
ABN , Publish Date - Dec 07 , 2025 | 02:37 PM
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ పరిధిలోని ఎర్రదొడ్డి గంగమ్మ గుళ్లో చోరీకి పాల్పడి అడ్డంగా దొరికిపోయాడు ఆలయ ఈఓ. స్థానికుల ఫిర్యాదు మేరకు అతణ్ని ఠాణాకు తరలించారు పోలీసులు.
శ్రీ సత్యసాయి జిల్లా, డిసెంబర్ 07: కదిరి(Kadiri) రూరల్ మండలం ఎర్రదొడ్డి గంగమ్మ దేవాలయంలో ఈఓ చేతివాటం బయటపడింది(Yerradoddi Gangamma Temple). ఆలయానికి రక్షణగా ఉండాల్సిన కార్యనిర్వాహక అధికారియే చోరీకి పాల్పడి.. అడ్డంగా దొరికిపోయాడు. అసలేం జరిగిందంటే...
ఎర్రదొడ్డి గంగమ్మ గుడి ఈఓ మురళీకృష్ణ(EO Murali Krishna).. ఆలయంలోని అమ్మవారికి సంబంధించిన 5 కిలోల వెండి ఆభరణాలు, చీరలు సహా ఇతర విలువైన వస్తువులు చాకచక్యంగా తస్కరించి చేతివాటం ప్రదర్శించాడు. ఎవరూ లేరనుకుని దోచుకున్న సామగ్రితో తప్పించుకునేందుకు సిద్ధమయ్యాడు. గమనించిన భక్తులు, స్థానికులు.. అడ్డంగా అతణ్ని పట్టుకున్నారు. అనంతరం.. పోలీసులకు సమాచారం అందించారు. పట్టుబడిన మురళీకృష్ణ సహా అతడి కుటుంబ సభ్యులను ఆటోలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అమ్మవారి ఆభరణాలను తస్కరించేందుకు ప్రయత్నించిన ఈఓపై భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్
గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి