Home » Tamilnadu News
రోడ్డుపక్క నిద్రిస్తున్న మతిస్థిమితం లేని ఓ యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేయబోయాడు. అక్కడే ఉన్న ఓ వీధి కుక్క అతడిని అడ్డుకుంది. యువకుడిపై దాడి చేసి అక్కడినుంచి తరిమేసింది.
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సేలం జిల్లా పర్యటన సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ ఓ వృద్ధురాలికి 40 వేల రూపాయలు విలువ చేసే తన సన్ గ్లాసెస్‌ను బహుమతిగా ఇచ్చారు.
బిర్యానీ పాత్రలో మహిళ శరీర భాగాలు లభ్యమైన కేసులో దిగ్ర్భాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మణిపూర్‌కు పరారైన మాణిక్ ఉత్తిన్, అతని ప్రియురాలు బసుమతి మాజీని పోలీసులు అరెస్టు చేసి రెండు రోజుల కిందట చెన్నైకి తీసుకొచ్చారు.
'విజయ్ ఫర్ పీఎం' నినాదంపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీవీకే కార్యకర్తలు, నేతల నుంచి వినిపిస్తున్న ఈ నినాదం కారణంగా టీవీకే, కాంగ్రెస్ మధ్య విభేదాలు మొదలైనట్టు వార్తలు వస్తున్నాయి.
ఇటీవలి 'ఇండియా టుడే - సీ ఓటర్ 'మూడ్ ఆఫ్ ద నేషన్' సర్వే ఫలితాలలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రధానమంత్రి అభ్యర్థుల రేసులో మూడో స్థానంలో నిలవడం సంచలనంగా మారింది.
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ శుక్రవారం చెన్నై సమీపంలోని పుఝల్ సెంట్రల్ జైలులో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జైలు సదుపాయాలు, ఖైదీలకు అందుతున్న వైద్యం, ఆహారం, విద్య, వృత్తి శిక్షణ తదితర అంశాలను ఆయన పరిశీలించారు.
తమిళనాడు అసెంబ్లీలో అత్యంత అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఎంతో కాలంగా వస్తున్న సంప్రదాయానికి ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వీడ్కోలు పలికారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం సీటును వదిలి మంత్రులో కలిసి కూర్చున్నారు.
భారత టీ20 చరిత్రలోనే గుర్తుండిపోయే రెండు అరుదైన రికార్డులు తమిళనాడు ప్రిమియర్ లీగ్‌లో చోటుచేసుకున్నాయి. టీఎన్‌పీఎల్2026లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్ లో తొలి ఓవర్ మొదటి మూడు బంతులకే వికెట్లు పడటమే కాకుండా.. ఐదుగురు బ్యాటర్లు గోల్డెన్ డకౌట్ అయ్యారు.
కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న కావేరీ జల వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక సూచనలు చేసింది. కర్ణాటక నుంచి తమకు రావాల్సిన కావేరీ నీటి వాటా సక్రమంగా అందడం లేదంటూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తమిళనాడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత డీఎంకే ప్రభుత్వంలో మూడు శాఖల్లో జరిగిన అవినీతికి సంబంధించిన వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు.