Share News

ప్రజలను కుక్కలతో పోల్చలేదు.. వివాదంపై రాఘవ లారెన్స్ వివరణ..

ABN , Publish Date - Jun 15 , 2026 | 07:51 PM

ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్‌ వివరణ ఇచ్చారు. ప్రజలను వీధి కుక్కలతో పోల్చారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

ప్రజలను కుక్కలతో పోల్చలేదు.. వివాదంపై రాఘవ లారెన్స్ వివరణ..
Raghava Lawrence

ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) వివరణ ఇచ్చారు. ప్రజలను వీధి కుక్కలతో పోల్చారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఇటీవల అభిమానులతో జరిగిన సమావేశంలో లారెన్స్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి (Lawrence street dog remark).


ఇటీవల అభిమానులతో జరిగిన సమావేశంలో తన రాజకీయ ప్రవేశం, కొత్త వాతావరణానికి అలవాటు పడటం గురించి మాట్లాడిన లారెన్స్.. ఒక ఉదాహరణగా వీధి కుక్కల ప్రస్తావన చేశారు. ఆ వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. 'ప్రజలను నేను ఎప్పుడూ నా తల్లితో సమానంగా భావిస్తాను. నేను ప్రజలను కుక్కలతో పోల్చానని వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యం, తప్పుదోవ పట్టించేవి' అని లారెన్స్ పేర్కొన్నారు (Raghava Lawrence controversy).


'మనం కొత్త ఇంటికి మారినప్పుడు.. అక్కడి పరిసరాలను అర్థం చేసుకోవడానికి, ఆ ప్రాంతంలోని కుక్కల అలవాట్లను తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందని ఒక ఉదాహరణగా చెప్పాను (Lawrence clarification). నేను ఎంతో గౌరవించే, అమ్మతో సమానంగా భావించే ప్రజలను కుక్కలతో పోల్చలేదు. కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి సమయం పడుతుందనే విషయం గురించి మాత్రమే నేను మాట్లాడాను తప్ప, ఎక్కడా ప్రజలను ఉద్దేశించి అలా అనలేదు' అని లారెన్స్ వివరణ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

ఐదు కంపెనీలుగా వేదాంతా.. కొత్త కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో అరంగేట్రం..


అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. స్వాగతించిన ప్రధాని మోదీ..

Updated Date - Jun 15 , 2026 | 08:05 PM