Share News

ఐదు సంస్థలుగా వేదాంతా.. కొత్త కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో అరంగేట్రం..

ABN , Publish Date - Jun 15 , 2026 | 03:08 PM

గనులు, లోహాలు, ఇంధన రంగ సంస్థ అయిన ప్రముఖ వేదాంత గ్రూప్‌ డీమర్జర్ ప్రక్రియ పూర్తయింది. విభజిత నాలుగు కొత్త కంపెనీలు సోమవారం బీఎస్‌ఈ, ఎన్ఎస్‌ఈ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.

ఐదు సంస్థలుగా వేదాంతా.. కొత్త కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో అరంగేట్రం..
Vedanta demerger

గనులు, లోహాలు, ఇంధన రంగ సంస్థ అయిన ప్రముఖ వేదాంత గ్రూప్‌ డీమర్జర్ ప్రక్రియ పూర్తయింది. విభజిత నాలుగు కొత్త కంపెనీలు సోమవారం బీఎస్‌ఈ, ఎన్ఎస్‌ఈ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. దీంతో వేదాంత గ్రూప్‌నకు చెందిన మొత్తం ఐదు కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌కు అందుబాటులోకి వచ్చాయి (Vedanta demerger).


వేదాంతా లిమిటెడ్‌తో పాటు వేదాంతా అల్యూమినియం మెటల్, వేదాంతా ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంతా పవర్, వేదాంతా ఐరన్ అండ్ స్టీల్ షేర్లు సోమవారం అరంగేట్రం చేశాయి. వేదాంతా అల్యూమినియం మెటల్ బీఎస్‌ఈలో రూ.527 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించి రూ.538 వద్ద గరిష్ఠాన్ని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.1.95 లక్షల కోట్లకు చేరింది. ఇక, వేదాంతా పవర్ బీఎస్‌ఈలో రూ.41.30 వద్ద లిస్టయింది. ఈ సంస్థ మార్కెట్ విలువ రూ.16,736 కోట్లకు చేరింది (Vedanta Aluminium share price).


అలాగే వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ రూ.14,487 కోట్ల మార్కెట్ విలువను, వేదాంతా ఐరన్ అండ్ స్టీల్ రూ.8231 కోట్ల మార్కెట్ విలువను చేరాయి (stock market news). ఇక, డీమర్జర్ పథకం ప్రకారం రికార్డు తేదీ అయిన మే1 నాటికి వేదాంతా లిమిటెడ్ షేర్లు కలిగి ఉన్న ప్రతి పెట్టుబడిదారుడికి కొత్తగా ఏర్పడిన నాలుగు కంపెనీల్లో ఒక్కో షేర్ కేటాయించారు. అంటే ఒక వేదాంతా షేర్‌కు అదనంగా నాలుగు కొత్త కంపెనీల్లో ఒక్కో షేర్ చొప్పున లభించింది.


ఈ వార్తలనూ చదవండి:

ట్రంప్‌ డీల్‌కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు : ఇజ్రాయెల్ మంత్రి

బీబీతో వ్యవహారం కష్టమే: డొనాల్డ్ ట్రంప్

Updated Date - Jun 15 , 2026 | 05:01 PM