అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. స్వాగతించిన ప్రధాని మోదీ..
ABN , Publish Date - Jun 15 , 2026 | 02:46 PM
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ఒప్పందంతో పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనడమే కాకుండా సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత రాకపోకలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ఒప్పందంతో పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనడమే కాకుండా సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత రాకపోకలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా ద్వారా ప్రధాని మోదీ స్పందించారు (PM Modi on US Iran peace deal).
'గత కొద్ది నెలలుగా పశ్చిమాసియాలో కొనసాగిన ఘర్షణల వల్ల అనేక దేశాల్లో ప్రాణనష్టం సంభవించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించి, శాశ్వత పరిష్కారానికి దోహదపడుతుంది. సుస్థిరమైన తుది ఒప్పందం కుదిరేలా.. మిగిలిన అంశాలపై కూడా సానుకూల చర్చలు కొనసాగుతాయని ఆశిస్తున్నాం' అని మోదీ పేర్కొన్నారు (Strait of Hormuz open).
ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేలా శాంతి ఒప్పందం ఖరారైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు (US Iran agreement). ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు యుద్ధ చర్యలను నిలిపివేసి, ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి మార్గాన్ని తిరిగి తెరవడానికి అంగీకరించాయి. దీనివల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్లలో ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఈ వార్తలనూ చదవండి:
ట్రంప్ డీల్‌కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు : ఇజ్రాయెల్ మంత్రి
బీబీతో వ్యవహారం కష్టమే: డొనాల్డ్ ట్రంప్