Home » Raghava Lawrence
ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ వివరణ ఇచ్చారు. ప్రజలను వీధి కుక్కలతో పోల్చారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ప్రజలు ఆమోదిస్తేనే తాను రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. ప్రజలు కాదంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు.
తన రాజకీయ ప్రవేశంపై కీలక రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు ఇటీవల వెల్లడించిన రాఘవ లారెన్స్.. తాజాగా ఆ తేదీని వాయిదా వేశారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూయడంతో ఆయనకు గౌరవ సూచకంగా తన ప్రకటనను వాయిదా వేసుకున్నారు.
తమిళనాట మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా లారెన్స్ చేసిన ప్రకటన దీనికి ఊతమిచ్చేలా కనిపిస్తోంది.
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘చంద్రముఖి’ (Chandramukhi). పీ.వాసు (P. Vasu) దర్శకత్వం వహించారు. శివాజీ ప్రొడక్షన్స్ నిర్మించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajini Kanth), ప్రభు (Prabhu), జ్యోతిక, వడివేలు, నయనతార, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.