Home » Supreme Court
జరూసలేం మత్తయ్యపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు గతంలో క్వాష్ చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
సుప్రీంకోర్టులో ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు గ్రామాల ట్రైబల్ కేసుపై మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసుపై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేసింది.
ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా, ఈ పిటిషన్‌పై ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు బెంచ్ విచారణ జరిపింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు బెంచ్ మద్దతు ఇచ్చింది.
ప్రమాదానికి కారణం పైలట్ల తప్పిదమేనని విచారణ పూర్తి కాకుండానే ఊహాగానాలు వ్యాప్తి చేయడం తగదని న్యాయమూర్తులు సూర్య కాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఛార్జిషీట్‌లో, ఎఫ్‌ఐఆర్‌లో ఏ4గా ఉన్న నిందితుడిపై ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మేనకా గురుస్వామి కోర్టుకు తెలిపారు. హైకోర్టే ట్రయల్ నిర్వహించి తీర్పు ఇచ్చేసిందని ప్రభుత్వం పేర్కొంది.
ప్రభాకర్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈరోజు న్యాయస్థానంలో విచారణ జరిగింది.
గాలి బ్రదర్స్‌కు అనుకూలంగా జగన్ హయాంలో ఇచ్చిన అఫిడవిట్‌ను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గాలి బ్రదర్స్ మైనింగ్ చేసుకోవడానికి అనుమతించవచ్చంటూ 2022లో జగన్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
వ్యర్థ పదార్ధాలను తగులబెట్టేందుకు బయోఫ్యూయెల్స్ వాడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయని సీజేఐ అన్నారు. రైతులు ప్రత్యేకమైన వారే, వాళ్ల వల్లే మనకు అన్నం దొరుకుతుంది. అలాగని పర్యవారణాన్ని పాడుచేస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా అని ప్రశ్నించారు.
హోటల్ వ్యాపారి జయశెట్టి హత్యకు సంబంధించిన కేసులో గత ఏడాది మేలో ప్రత్యేక కోర్టు చోటా రాజన్‌ను దోషిగా నిర్ధారించింది. జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును ముంబై హైకోర్టులో చోటారాజన్ సవాలు చేశారు.
కాంగ్రెస్ మాజీ ఎంపీ, దివంగత నాయకుడు వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ దర్యాప్తు కొనసాగించే విషయంలో ట్రయల్ కోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేయాలని సునీతకు సుప్రీం ధర్మాసనం సూచించింది.