Share News

Supreme Court: ఆరావళి మైనింగ్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..

ABN , Publish Date - Dec 29 , 2025 | 01:45 PM

ఆరావళి పర్వత శ్రేణిపై ఒక కమిటీ సిఫార్సులను ఆమోదించాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న తరువాత, ఆరావళికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ సుమోటో కేసు ప్రారంభమైంది.

Supreme Court: ఆరావళి మైనింగ్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..
Aravalli Hills Mining Case

ఢిల్లీ : ఆరావళి పర్వత శ్రేణుల్లో మైనింగ్ (Aravalli mining) వివాదంపై సిజెఐ జస్టిస్ సూర్యకాంత (CJI Justice Suryakanta) నేతృత్వంలో సోమవారం విచారణ జరిగింది. ఇటీవల ఆరావళి కొండలకు (Aravalli Mountains) ఆమోదించిన నిర్వచనాలకు (Definition) సంబంధించిన కొన్ని వివరణలు అవసరమని సుప్రీం కోర్టు (Supreme Court) సోమవారం పేర్కొంది, అదే సమయంలో ఈ అంశంపై గత నెలలో జారీ చేసిన తీర్పుపై స్టే విధించింది. గతంలో అధికారులతో కూడిన కమిటీ చేసిన సిఫార్సుల పర్యావరణ ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని కోర్టు పేర్కొంది. ఆరావళి కొండల నిర్వచనంపై దాఖలైన సమస్యపై సుమోటో(Suo Motu) కేసులో కోర్టు సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.


100 మీటర్ల‌లోపు ఎత్తు ఉన్న ఆరావళి పర్వతాల వద్ద మైనింగ్‌కు గతంలో అనుమతులు ఇచ్చింది సుప్రీంకోర్టు. తాజాగా గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ నేడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా తాత్కాలిక దరఖాస్తుదారుల ప్రవర్తనపై సీజెఐ తీవ్ర అసంతృప్తి చెందారు. ఆరావళి పర్యతాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, పర్యావరణ ముప్పునకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కమిటీకి సూచించింది. ఈ కేసును జనవరి 21,2026 న వివరణాత్మకంగా విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.


ఇవీ చదవండి

కిడ్నీలను టచ్ చేసిందిగా.. పాక్ మహిళా ఆఫీసర్‌పై ట్రోలింగ్

ఎంత దారుణం! ఐదుగురు పిల్లల తల్లి.. కన్నబిడ్డలపై కనికరం లేకుండా..

Updated Date - Dec 29 , 2025 | 01:45 PM