Unnao Case Updates: ఉన్నావ్ అత్యాచార కేసులో 'సుప్రీం' కీలక నిర్ణయం.. నిందితుని బెయిల్‌పై స్టే..
ABN , Publish Date - Dec 29 , 2025 | 12:57 PM
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ అత్యాచార కేసుపై సుప్రీం కోర్టులో తాజాగా విచారణలు జరిగాయి. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది న్యాయస్థానం.
ఇంటర్నెట్ డెస్క్: ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీమ్ ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది(Unnao Case Updates). 2017లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అత్యాచార కేసులో.. బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగార్(Kuldeep Singh Sengar)కు ఢిల్లీ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది(Delhi High Court). దీన్ని సవాల్ చేస్తూ ఇద్దరు న్యాయవాదులు సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. మరోవైపు ఇదే విషయమై.. సీబీఐ కూడా సర్వోన్న న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్లు వేసింది. కుల్దీప్ బయటకు వస్తే కేసుపై ప్రభావం పడే అవకాశముందని సీబీఐ పేర్కొంది.
ఈ వ్యాజ్యంపై సీజేఐ సూర్యకాంత్(CJI Suryakanth), న్యాయమూర్తులు జేకే.మహేశ్వరి, జస్టిస్ అగస్టీన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. సోమవారం విచారణ చేపట్టింది. బాధితురాలి భద్రతకు సంబంధించిన అంశాలతో సీబీఐ ప్రస్తావించిన అంశాలను ధర్మాసనం పరిశీలించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉత్తర్వులను నిలిపివేయడంతో పాటు నిందితుడు కుల్దీప్ సెంగార్‌కు నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు పిటిషన్‌పై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సెంగార్‌ను ఆదేశించింది.
ఇదీ ఘటన..
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో 2017లో 17ఏళ్ల ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే, నాటి బీజేపీ నేత కుల్దీప్ సెంగార్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తేలాడు. అయితే.. ఈ కేసు విచారణలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2018లో ఈ కేసును సీబీఐ విచారణ చేపట్టింది. ఆ తర్వాత యూపీ ట్రయల్ కోర్టు, ఢిల్లీ కోర్టులకు మారింది. 2019 డిసెంబర్‌లో కుల్దీప్ దోషిగా తేలడంతో అతనిపై జీవితఖైదు విధించింది న్యాయస్థానం. అయితే.. తాజాగా ఈ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సెంగార్‌కు పోక్సో చట్టం వర్తించదని.. ఢిల్లీ హైకోర్టు ఇటీవల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇవీ చదవండి: