Share News

SC Telangana verdict: రూ.15 వేల కోట్ల విలువైన భూమి.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట..

ABN , Publish Date - Dec 18 , 2025 | 07:48 PM

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. వనస్థలిపురం దగ్గర ఉన్న 102 ఎకరాల భూమిపై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో దీర్ఘ కాలంగా కొనసాగుతున్న భూ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టైంది..

SC Telangana verdict: రూ.15 వేల కోట్ల విలువైన భూమి.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట..
Supreme Court

ఇంటర్నెట్ డెస్క్: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. రూ.15 వేల కోట్ల విలువైన భూములపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వనస్థలిపురం దగ్గర ఉన్న 102 ఎకరాల భూమి తెలంగాణ రాష్ట్ర పరిధిలోని అటవీ శాఖదేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దాదాపు 20 ఏళ్లుగా ఈ భూమిపై వివాదం కొనసొగుతోంది. ఈ భూమిపై హక్కులు తమవేనని నిజాం, సాలార్‌జంగ్‌, మీరాలం వారసులం అంటూ కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు(Telangana Govt relief Supreme Court).


గతంలో పిటిషన్లు వేసిన 260 మందికి హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది(Telangana Legal relief). దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ తర్వాత ద్విసభ్య ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. అది పూర్తిగా అటవీ భూమి అని.. దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు ఉన్నాయని తేల్చి చెప్పింది.


ఆ భూమిపై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది(SC Order TG Govt). తీర్పు వెలువడిన 8 వారాల్లో ఆ 102 ఎకరాలను రిజర్వ్‌ ఫారెస్ట్‌గా నోటిఫై చేయాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది. నోటిఫికేషన్‌ కాపీని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి పంపాలని ధర్మాసనం సూచించింది. దీంతో 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదం ఓ కొలిక్కి వచ్చింది.


ఇవి కూడా చదవండి..

ప్రధాని మోదీకి మరో గౌరవం.. ఒమన్ అత్యున్నత పురస్కారం

మూగ జీవాలకు ఆహారం పెడితే.. కలిగే ప్రయోజనాలు..

పంచాయితీ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ ఘన విజయం..

Updated Date - Dec 18 , 2025 | 09:00 PM