Home » Supreme Court
ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల వివాదంలో ముగ్గురు ప్రముఖ విద్యావేత్తలకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. గతంలో వారిపై విధించిన నిషేధాన్ని, ప్రతికూల ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం సవరించింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడు భాషల బోధనను తప్పనిసరి చేస్తూ తీసుకువచ్చిన నూతన విద్యా విధానం ఇప్పుడు న్యాయ వివాదానికి దారితీసింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కేజీ బేసిన్ గ్యాస్ తరలింపు వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రూ.12,800 కోట్ల విలువైన ఈ భారీ సహజ వాయువు వివాదంపై విచారణను నిలిపివేయాలన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేద రోగులకు ఉచిత చికిత్స అందించే వ్యవస్థపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు సూచించింది.
చిన్న పిల్లలు తాగే ఫ్రూట్ జ్యూస్‌లు, మిల్క్ షేక్‌ల తరహాలో టెట్రా ప్యాక్‌లు, సాచెట్లలో వోడ్కా లిక్కర్‌ను విక్రయించడంపై సుప్రీంకోర్టు బుధవారంనాడు తీవ్ర ఆక్షేపణ తెలిపింది. ఇది వినియోగదారులను, అభం శుభం తెలియని చిన్నారులను తప్పుదారి పట్టించడమే అవుతుందని పేర్కొంది.
ప్రభుత్వ భూములు రాయితీపై తీసుకున్న ఆస్పత్రులు ఉచిత సేవలు ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆర్థికంగా బలహీన వర్గాల వారికి ఉచిత చికిత్సను అమలు చేయడానికి విధివిధానాలను రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జనగణనలో కులగణన చేపట్టాలన్న సుప్రీం కోర్టు తీర్పును టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్వాగతించారు. సామాజిక, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి కులగణన అత్యంత అవసరమని చెప్పుకొచ్చారు.
కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనగణనలో కులాల లెక్కింపునకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అనుమతి ఇచ్చారు.
వీధికుక్కల వల్ల సామాన్య ప్రజలకు గాయాలైనా, హాని లేదా నష్టం జరిగితే.. దానికి సంబంధించిన న్యాయపరమైన బాధ్యతను తీసుకునేందుకు జంతుప్రేమికులు, జంతు సంక్షేమ సంస్థలు, ఎన్జీవోలు సిద్ధమేనా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
హిందూ దేవాలయాలు, మతపరమైన దేవాదాయ సంస్థల నియంత్రణ చట్టాల రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.