Home » Sunday
గుజరాత్‌లోని ఖేడా జిల్లాకు చెందిన కాజీపురా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, బడి పిల్లలకు పాఠాలతో పాటు డబ్బు పొదుపు చేయడం కూడా నేర్పిస్తున్నారు. ఇందుకోసం స్కూల్లోని ఒక ఖాళీ గదిని బ్యాంకుగా మార్చి, దానికి ‘బ్యాంక్ ఆఫ్ కాజీపురా’ అని పేరు పెట్టారు.
వెంట్రిలాక్విజం... ఒక అరుదైన కళ. ‘మాట్లాడే బొమ్మ’గా విశేష గుర్తింపు పొందిన ఈ కళప్రస్తుతం కనుమరుగయ్యే దశలో ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా గొప్పగొప్ప కళాకారులు... పలు ప్రదర్శనల్లో ఉపయోగించిన బొమ్మలతో ఏకంగా ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.
బెర్లిన్ నగరానికి 60 కి.మీ దూరంలో క్రాస్నిక్ మున్సిపాలిటీ పరిధిలో ‘ట్రాపికల్ ఐలాండ్స్ రిసార్టు’ ఉంది. ఆరుబయట కాకుండా... ఐరన్ డోమ్‌లో రిసార్టు ఉండటం విశేషం. 1181 అడుగుల పొడవు, 688 అడుగుల వెడల్పుతో డోమ్ అత్యంత విశాలంగా ఉంటుంది.
తెలుగులో కూడా పూరికలున్నాయి. కానీ, వ్యుత్పత్తి అర్థం వేరు. తెలుగులో పూరిక అంటే పొంగినదని! మూలద్రావిడ శబ్దం పూరి తెలుగులో బూర అయ్యింది. గాలి ఊదితే పొంగే బెలూనుని బూర అంటారు. బూరలా పొంగే వంటకాలు ప్రముఖంగా రెండున్నాయి.
నగరాల్లో ట్రాఫిక్ సమస్య తెలిసిందే. రోడ్లు ఎంత విస్తరించినా ట్రాఫిక్ కష్టాలు మాత్రం తీరడం లేదు. అందుకే కొన్ని నగరాల్లో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభించారు. అయితే 125 ఏళ్ల క్రితమే జర్మనీలో భిన్నమైన రైలు సర్వీసును ప్రారంభించారు.
దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే ఒత్తిడి, పరిసరాలు, పర్యావరణం, సరైన నిద్ర, జన్యువులు, మానసిక రుగ్మతలు, పోషక లోపాలు వంటి అనేక కారణాల వల్ల మానసిక స్థితి ప్రభావితమవుతుంది. మనం తీసుకునే ఆహారం మెదడు నిర్మాణం, పని తీరును, తద్వారా మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది.
వంద కిలోల క్యాబేజీ, వెయ్యి కిలోల గుమ్మడికాయ, భారీ క్యాలీ ఫ్లవర్... వాటిని అంత పెద్దగా ఎలా పండిస్తారనే సందేహం సందర్శకులకు సహజంగానే కలుగుతుంది. ఆశ్చర్యంగా, ఆసక్తిగా వాటిని చూస్తూండిపోతారెవరైనా. ఎక్కడ? ఎలా? ఎందుకు? అంటే అలస్కాకు వెళ్లాల్సిందే.
పిచ్చి పలురకాలు... వెర్రి వేయి రకాలు..’ అని వూరికే అనలేదు మన పెద్దలు. ఆ వెర్రి ఇప్పుడు టూరిజాన్ని పట్టుకుంది. కరోనా తర్వాత రివేంజ్ తీర్చుకున్నట్లు పొలోమని ప్రపంచమంతా చుట్టేస్తున్నారు పర్యాటకులు. కొందరైతే వెళ్లిన దేశానికే మళ్లీ మళ్లీ వెళుతున్నారు.
రాణీ రుద్రమ సైన్యం యుద్ధ తంత్రాలకు వేదిక... కాకతీయుల కోట వరకు రహస్య సొరంగాలున్న నేల... ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు నెలవైన ప్రాంతం... వరంగల్ నగరానికి కూతవేటు దూరంలో... గీసుకొండ మండలం మొగిలిచర్లలో కాకతీయుల కాలంలో నిర్మిం చిన ‘ఏకవీర’ ఆలయం ఉంది.
సమయం, సందర్భం వచ్చినప్పుడు... పర్యావరణం గురించి మాట్లాడడం, మొక్కలు నాటడం... చాలాచోట్ల, చాలామంది చేసేదే. కానీ పర్యావరణహితం కోరుకునే ఒక గ్రామం మాత్రం ఇలాంటి సమయం, సందర్భాల కోసం వేచి చూడలేదు.