Home » Stock Market
భారత స్టాక్ మార్కెట్ సెప్టెంబర్ 17న మరోసారి దుమ్మురేపింది. సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా రెండో రోజు తమకు తాము సవాల్ విసిరినట్టు సరికొత్త గరిష్ఠాల్ని చేరాయి. ఇండియా-అమెరికా మధ్య ట్రేడ్ చర్చలు సానుకూల దిశగా సాగాయన్న సంకేతాలతో ఇన్వెస్టర్ల ఉత్సాహం పెరిగింది.
సోమవారం స్వల్ప నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం విజృంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో పాటు యుఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించనుందనే అంచనాలు సూచీలను ముందుకు నడిపించాయి.
గత వారం వరుస లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలను చవిచూశాయి. బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం లాభాలను ఆర్జించాయి.
గత మూడు రోజులుగా వరుస లాభాలు అందుకుంటున్న దేశీయ సూచీలు గురువారం కాస్త నెమ్మదించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ప్రకటించనుండడంతో పాటు, శుక్రవారం దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కాబోతుండడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
బంగారం కొనాలనుకునే వారికి షాక్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 11న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
భారత్‌తో ట్రేడ్ డీల్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకుల వ్యాఖ్యలు చేయడం మదుపర్లలో సానుకూల సంకేతాలను నింపింది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించవచ్చనే అంచనాలు కూడా పాజిటివ్ సెంటిమెంట్‌ను పెంచాయి.
దేశంలో ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ మరోసారి కీలక ప్రకటన చేసింది. షేర్ బైబ్యాక్ అంటూ షేర్హోల్డర్లు, ఇన్వెస్టర్లకు మంచి ఛాన్స్ ఇచ్చింది. ఇది కంపెనీ ఆర్థిక బలాన్ని పెంచడంతోపాటు వీరికి కూడా లాభం చేకూరనుంది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించవచ్చనే అంచనాలు మదుపర్లలో విశ్వాసాన్ని కలిగించడంతో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతున్న ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా అంచనాలకు అనుగుణంగానే ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి.
దేశీయంగా బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 9న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
జీఎస్టీ సంస్కరణలు దేశీయ సూచీలకు మంచి బూస్టింగ్ ఇస్తున్నాయి. జీఎస్టీ నూతన సంస్కరణలు మదుపర్లలో విశ్వాసాన్ని కలిగించడంతో సూచీలు ఈ వారాన్ని కూడా లాభాలతో ప్రారంభించాయి. ఈ నెల 12వ తేదీన ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కాబోతున్నాయి.