Stock Market: వరుస నష్టాల నుంచి ఉపశమనం.. మీషో బంపర్ లిస్టింగ్..
ABN , Publish Date - Dec 10 , 2025 | 10:20 AM
ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. మొదటి రోజున ఐపీఓ ధరతో పోల్చుకుంటే 46 శాతం ప్రీమియంతో లిస్ట్ అయి లాభాలను పంచింది. గత కొన్ని సెషన్లుగా వరుసగా నష్టపోతున్న దేశీయ సూచీలు బుధవారం కోలుకున్నాయి.
గత కొన్ని సెషన్లుగా వరుసగా నష్టపోతున్న దేశీయ సూచీలు బుధవారం కోలుకున్నాయి. లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. మొదటి రోజున ఐపీఓ ధరతో పోల్చుకుంటే 46 శాతం ప్రీమియంతో లిస్ట్ అయి లాభాలను పంచింది. రూపాయి కాస్తా కోలుకోవడం, అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటనపై ఆసక్తి, కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (84, 666)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి ఎగబాకింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 313 పాయింట్ల లాభంతో 84, 979 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 75 పాయింట్ల లాభంతో 25, 915 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో హిందుస్థాన్ జింక్, సమ్మన్ క్యాపిటల్, మనప్పురం ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కేన్స్ టెక్నాలజీస్, పేటీఎమ్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, డెలివరీ, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 181పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 193 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.76గా ఉంది.
ఇవి కూడా చదవండి
జీఎంహెచ్ఎంసీ వార్డుల సంఖ్య పెంపు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
రో-కో ఇంకా ఏం నిరూపించుకోవాలి?: అశ్విన్