Stock Market: నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఏవో తెలుసా..
ABN , Publish Date - Dec 08 , 2025 | 09:47 AM
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి రోజు రోజుకూ క్షీణిస్తుండడంతో దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. రూపాయి క్షీణిస్తుండడం స్టాక్ మార్కెట్లపై నెగిటివ్ ప్రభావం చూపుతోంది.
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి రోజు రోజుకూ క్షీణిస్తుండడంతో దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. రూపాయి క్షీణిస్తుండడం స్టాక్ మార్కెట్లపై నెగిటివ్ ప్రభావం చూపుతోంది. దీంతో ఈ వారాన్ని దేశీయ సూచీలు నష్టాలతో ప్రారంభించాయి. అలాగే అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలకు కారణంగా కనబడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (85, 712)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 100 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు దిగజారింది. ప్రస్తుతం ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్ 209 పాయింట్ల నష్టంతో 85, 502 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 69 పాయింట్ల నష్టంతో 26, 116 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో హెచ్‌ఎఫ్‌సీఎల్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, దాల్మియా భారత్, టెక్ మహీంద్రా మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కేన్స్ టెక్నాలజీస్, గోద్రేజ్ ప్రాపర్టీస్, హీరో మోటోకార్ప్, ప్రెస్టీజ్ ఎస్టేట్, మాజగాన్ డాక్ మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 42 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.08గా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News