Stock Market: చివర్లో కొనుగోళ్లు.. నష్టాల నుంచి కోలుకున్న సూచీలు..
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:10 PM
ఉదయం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్టంతో పోల్చుకుంటే 400 పాయింట్లు పైకి వచ్చాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లపై ఆసక్తి సూచీలకు ఊరట కలిగించింది.
ఉదయం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్టంతో పోల్చుకుంటే 400 పాయింట్లు పైకి వచ్చాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లపై ఆసక్తి సూచీలకు ఊరట కలిగించింది. అలాగే అమెరికా ఫ్యూచర్స్ లాభాల్లో కొనసాగుతుండడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు సూచీలను పైకి లేపాయి. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలతో రోజును ముగించాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (85, 267)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 350 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు అలాగే ట్రేడ్ అయింది. ఒక దశలో సెన్సెక్స్ 400 పాయింట్లు కోల్పోయి 85, 840 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత నష్టాల నుంచి కోలుకుంది. చివరకు సెన్సెక్స్ 54 పాయింట్ల నష్టంతో 85, 213 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 19 పాయింట్ల నష్టంతో 26, 027 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్‌లో ఎన్‌బీసీసీ, ఐఓసీ, డిక్సన్ టెక్నాలజీస్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, కేఈఐ ఇండస్ట్రీస్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). బీఎస్‌ఈ లిమిటెడ్, ఏబీ క్యాపిటల్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ, వోడాఫోన్ ఐడియా, కేపీఐటీ టెక్నాలజీస్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 70 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 71 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.73గా ఉంది.
ఇవి కూడా చదవండి..
అతిథులకు అదిరిపోయే విందు.. ఈ మర్యాదలు చూస్తే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే..
మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. ఈ నది ఒడ్డున కుక్క ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..