Stock Market: భారీ నష్టాల్లో దేశీయ సూచీలు.. 500 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్..
ABN , Publish Date - Dec 09 , 2025 | 10:21 AM
భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యం వంటి పలు వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు విధించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు రావడంతో దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంపై బుధవారం సమావేశం కానుంది.
భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యం వంటి పలు వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు విధించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు రావడంతో దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంపై బుధవారం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అలాగే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి రోజు రోజుకూ క్షీణిస్తుండడం, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలకు కారణంగా కనబడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (85, 102)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 400 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు దిగజారింది. ఒక దశలో 800 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 560 పాయింట్ల నష్టంతో 84, 542 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 176 పాయింట్ల నష్టంతో 25, 784 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో కేన్స్ టెక్నాలజీ, డెలివరీ, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఒబెరాయ్ రియాలిటీ, టైటాన్ కంపెనీ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కోఫోర్జ్, ఆసియన్ పెయింట్స్, హీరో మోటోకార్ప్, నాల్కో, సీడీఎస్‌ఎల్ మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 174 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 473 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.01గా ఉంది.
ఇవీ చదవండి:
ఏఐతో లేఆఫ్స్ భయాలు.. ఐబీఎమ్ సీఈఓ కీలక కామెంట్స్
ఎస్‌ఐపీ పెట్టుబడుల ఆకర్షణలో పడి ఈ తప్పు చేయొద్దు.. ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధికారి సూచన
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి