Stock Market: ఫుల్ జోష్‌లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Dec 12 , 2025 | 10:17 AM
అమెరికా, భారత్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరే పరిస్థితులు కనిపిస్తుండడం, ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడడం, అంతర్జాతీయంగా సానుకూలాంశాలు మార్కెట్లను ముందుక నడిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి.
వరుస నష్టాల నుంచి కోలుకుని గురువారం లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు శుక్రవారం కూడా లాభాల బాటలోనే సాగుతున్నాయి. లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా, భారత్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరే పరిస్థితులు కనిపిస్తుండడం, ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడడం, అంతర్జాతీయంగా సానుకూలాంశాలు మార్కెట్లను ముందుక నడిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (84, 818)తో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం లాభాలతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తోంది. ఒక దశలో 400 పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 257 పాయింట్ల లాభంతో 85, 075 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 96 పాయింట్ల లాభంతో 25, 995 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో హిందుస్థాన్ జింక్, కేన్స్ టెక్నాలజీస్, దాల్మియా భారత్, సమ్మన్ క్యాపిటల్, హిందాల్కో మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఒరాకిల్ ఫిన్‌సెర్వ్, కంటైనర్ కార్పొరేషన్, కేఈఐ ఇండస్ట్రీస్, మారికో, సయింట్ మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 227 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 405 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.39గా ఉంది.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
మురికిగా, అసహ్యంగా ఉండే జనాన్నే తెచ్చుకున్నాం: ట్రంప్ జాత్యాంహకార వ్యాఖ్యలు..