Stock Market: ఒడిదుడుకుల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Dec 11 , 2025 | 10:24 AM
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మరింత పతనమవడం, అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో సూచీలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ ఓ మోస్తరు లాభాల్లో కదలాడుతున్నాయి.
గత కొన్ని సెషన్లుగా వరుసగా నష్టపోతున్న దేశీయ సూచీలు గురువారం లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. లాభాలతో ప్రారంభమయ్యాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మరింత పతనమవడం, అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో సూచీలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ ఓ మోస్తరు లాభాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (84, 391)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభనష్టాలతో దోబూచులాడుతోంది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 123 పాయింట్ల లాభంతో 84, 514 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 57 పాయింట్ల లాభంతో 25, 815 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో హిందుస్థాన్ జింక్, కేన్స్ టెక్నాలజీస్, సోనా బీఎల్‌డబ్ల్యూ, నవుమా వెల్త్, హెచ్‌ఎఫ్‌సీఎల్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). సుప్రీమ్ ఇండస్ట్రీస్, టైటాన్ కంపెనీ, ఐఓసీ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, చోలా ఇన్వెస్ట్ మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 162 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 356 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.22గా ఉంది.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
మురికిగా, అసహ్యంగా ఉండే జనాన్నే తెచ్చుకున్నాం: ట్రంప్ జాత్యాంహకార వ్యాఖ్యలు..