Home » Stock Market
స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వారాంతం ట్రేడింగ్‌లో ఆద్యంతం తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ, చివర్లో బ్యాంకింగ్ సహా ఇతర బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లతో లాభాల్లో ముగిశాయి.
1992లో హర్షద్ మెహతా స్కాం భారత స్టాక్ మార్కెట్‌ను షేక్ చేసిన చేసిన తర్వాత, ఇటీవల మరో పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఐదు వేల కోట్లు కాగా, ఈసారి మాత్రం రూ.36 వేల కోట్లకుపైగా స్కాం (SEBI Jane Street) జరిగినట్లు తెలుస్తోంది.
అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్ కుదరవచ్చు అనే అంచనాలతో సూచీలు రోజంతా లాభాల్లో కదలాడాయి. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో లాభాలను కోల్పోయి నష్టాలతో రోజును ముగించాయి. ఉదయం భారీ లాభాల్లో కదలాడిన సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతోనే రోజును ముగించాయి.
మీరు పన్ను ఆదా చేయడంతోపాటు మంచి రాబడి పొందాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే అలాంటి టాప్ 3 ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ELSS) గురించి ఇక్కడ తెలుపడం (Tax Saving Funds) జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
సోమవారం నష్టాలను చవిచూసిన సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఈ రోజు మళ్లీ నష్టాల బాట పట్టాయి. ఉదయం స్వల్ప లాభాల్లో మొదలైన సూచీలు మధ్యాహ్నం తర్వాత నష్టాల బాట పట్టాయి. చివరకు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లోనే రోజును ముగించాయి.
సాధారణంగా ఎవరికైనా కూడా ధనవంతులు కావాలని ఉంటుంది. కానీ దీనికోసం ఏ స్కీంలో ఇన్వెస్ట్ (Investment Tips) చేయాలి, ఎలా ప్లాన్ చేయాలనేది తెలియదు. అయితే ఇక్కడ చెప్పిన విధానాన్ని పాటిస్తే మాత్రం కోటీశ్వరులు కావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.
ఇంట్రాడేలో నిఫ్టీని 25,500 కంటే దిగువకు లాగడంతో భారత ఈక్విటీ సూచీలు వారాన్ని ఈ ఉదయం బలహీనంగా ప్రారంభించాయి. మెటల్, ఆటో, రియాల్టీ, FMCG షేర్లలో బలమైన అమ్మకాలు కనిపించాయి. అయితే, PSU బ్యాంక్, ఐటీ, మీడియాలో కొనుగోళ్లు ..
మీరు కేవలం 500 రూపాయలతో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి చేయాలని చూస్తున్నారా. అయితే మీకోక మంచి ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే తాజాగా జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ (Jio BlackRock Mutual Fund) కొత్తగా సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
మొదట ఫ్లాట్‌గా మొదలైన సూచీలు ఆ తర్వాత నష్టాల బాట పట్టాయి. ఆసియా-పసిఫిక్ ప్రధాన మార్కెట్లు అన్నీ సానుకూలంగానే కదలాడుతున్నాయి. దేశీయ సూచీల నష్టాలకు లాభాల స్వీకరణ మాత్రమే కారణంగా కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
కొంత కాలంగా ఆల్‌టైమ్ గరిష్టంలో ట్రేడ్ అయిన బంగారం (gold), వెండి (silver) ధరలు మళ్లీ దిగి వస్తున్నాయి. 10 గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల కిందకు దిగివచ్చింది. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.