Stock Market: మూడో రోజూ లాభాలే.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Sep 10 , 2025 | 10:40 AM
భారత్‌తో ట్రేడ్ డీల్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకుల వ్యాఖ్యలు చేయడం మదుపర్లలో సానుకూల సంకేతాలను నింపింది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించవచ్చనే అంచనాలు కూడా పాజిటివ్ సెంటిమెంట్‌ను పెంచాయి.
భారత్‌తో ట్రేడ్ డీల్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు చేయడం మదుపర్లలో విశ్వాసం నింపింది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించవచ్చనే అంచనాలు కూడా పాజిటివ్ సెంటిమెంట్‌ను పెంచాయి. ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతున్న ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా అంచనాలకు అనుగుణంగానే ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఇన్ని సానుకూలాంశాల నడుమ సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో కొనసాగుతున్నాయి (Indian stock market).
మంగళవారం ముగింపు (81, 101)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 400 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ఒక దశలో దాదాపు 540 పాయింట్లు లాభపడి 81,600 వేల మార్క్‌ను కూడా క్రాస్ చేసింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 515 పాయింట్ల లాభంతో 81, 616 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 161 పాయింట్ల లాభంతో 25, 029 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో ఒరాకిల్ ఫిన్‌సర్వ్, సయింట్, పెర్సిస్టెంట్, ఎంఫసిస్, టాటా ఎలక్సీ షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). సుప్రీమ్ ఇండస్ట్రీస్, టీవీఎస్ మోటార్స్, హోరీ మోటోకార్ప్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 553 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 454 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.14గా ఉంది.
ఇవి కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారత ప్రధానితో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..