Share News

Stock Market: వరుసగా రెండో రోజూ లాభాలే.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Sep 17 , 2025 | 04:12 PM

మంగళవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం కూడా అదే జోరును కొనసాగించాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయనే వార్తలు మదుపర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.

Stock Market: వరుసగా రెండో రోజూ లాభాలే..  ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
Stock Market

మంగళవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం కూడా అదే జోరును కొనసాగించాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయనే వార్తలు మదుపర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో పాటు యుఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించనుందనే అంచనాలు సూచీలను ముందుకు నడిపించాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం ఈ రోజు రాత్రి వెలువడనుంది. ఈ నేపథ్యంలో బుధవారం సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలను ఆర్జించాయి (Business News).


మంగళవారం ముగింపు (82, 380)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 100 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజుంతా లాభాల్లోనే కదలాడింది (Sensex gains). బుధవారం సెన్సెక్స్ 82, 490 - 82, 741 శ్రేణి మధ్యలో కదలాడింది. చివరకు సెన్సెక్స్ 313 పాయింట్ల లాభంతో 82, 693 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 91 పాయింట్ల లాభంతో 25, 330 వద్ద స్థిరపడింది (market closing update).


సెన్సెక్స్‌లో టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, కేపీఐటీ టెక్నాలజీస్, పీఎన్‌బీ, ఎస్బీఐ షేర్లు లాభాలను ఆర్జించాయి (Indian markets today). వొడాఫోన్ ఐడియా, ఐసీఐసీఐ లాంబార్డ్, ఏబీ క్యాపిటల్, జిందాల్ స్టీల్, సుప్రీమ్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల బాటలో నడిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 49 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 349 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.81గా ఉంది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 17 , 2025 | 04:12 PM