Stock Market: ఫ్లాట్‌గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Sep 11 , 2025 | 10:14 AM
గత మూడు రోజులుగా వరుస లాభాలు అందుకుంటున్న దేశీయ సూచీలు గురువారం కాస్త నెమ్మదించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ప్రకటించనుండడంతో పాటు, శుక్రవారం దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కాబోతుండడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
గత మూడు రోజులుగా వరుస లాభాలు అందుకుంటున్న దేశీయ సూచీలు గురువారం కాస్త నెమ్మదించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ప్రకటించనుండడంతో పాటు, శుక్రవారం దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కాబోతుండడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు కూడా దేశీయ సూచీలను కాస్త వెనక్కి లాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభా నష్టాలతో దోబూచులాడుతున్నాయి (Indian stock market).
బుధవారం ముగింపు (81, 425)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 200 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత తేరుకుంది. ఒక దశలో 160 పాయింట్లు లాభపడింది. ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతోంది. ఉదయం 10:10 గంటల సమయంలో సెన్సెక్స్ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 81, 431 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 2 పాయింట్ల లాభంతో 24, 975 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, పీఎన్‌బీ, ఎన్‌హెచ్‌పీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). సోనా బీఎల్‌డబ్ల్యూ, ఇన్ఫో ఎడ్జ్, ఎంఫసిస్, గ్లెన్‌మార్క్, టాటా ఎలాక్సీ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 10 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.17గా ఉంది.
ఇవి కూడా చదవండి
భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..
34 వాహనాల్లో మానవబాంబులు.. బెదిరింపు మెయిల్స్‌తో హైఅలర్ట్
For More National News and Telugu News