Stock Market: సూచీలకు స్వల్ప నష్టాలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:08 PM
గత వారం వరుస లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలను చవిచూశాయి. బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం లాభాలను ఆర్జించాయి.
గత వారం వరుస లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలను చవిచూశాయి. బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం లాభాలను ఆర్జించాయి. మంగళ, బుధ వారాల్లో యుఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో నిర్ణయాన్ని వెల్లడించనుంది. దీంతో మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సోమవారం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలను చవిచూశాయి (Business News).
గత శుక్రవారం ముగింపు (81, 904)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభనష్టాలతో దోబూచులాడింది (Sensex gains). సోమవారం సెన్సెక్స్ 81,998-81,744 శ్రేణి మధ్యలో కదలాడింది. చివరకు సెన్సెక్స్ 118 పాయింట్ల నష్టంతో 81, 785 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 44 పాయింట్ల నష్టంతో 25, 069 వద్ద స్థిరపడింది (market closing update).
సెన్సెక్స్‌లో వోడాఫోన్ ఐడియా, ఎస్బీఐ కార్డ్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్, ఇండియన్ రెన్యుబుల్, హడ్కో షేర్లు లాభాలను ఆర్జించాయి. బయోకాన్, ఆసియన్ పెయింట్స్, సిప్లా, బంధన్ బ్యాంక్, ఎమ్ అండ్ ఎమ్ షేర్లు నష్టాల బాటలో నడిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 258 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 78 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.21గా ఉంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి