Share News

Stock Market: కొనసాగుతున్న లాభాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Sep 09 , 2025 | 10:29 AM

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించవచ్చనే అంచనాలు మదుపర్లలో విశ్వాసాన్ని కలిగించడంతో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతున్న ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా అంచనాలకు అనుగుణంగానే ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి.

Stock Market: కొనసాగుతున్న లాభాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
Stock Market

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించవచ్చనే అంచనాలు మదుపర్లలో విశ్వాసాన్ని కలిగించడంతో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతున్న ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా అంచనాలకు అనుగుణంగానే ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఇక, జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు దేశ అభివృద్ధికి సహకరిస్తాయని విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో కొనసాగుతున్నాయి (Business News).


సోమవారం ముగింపు (80, 787)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 300 పాయింట్ల లాభాలతో మొదలైన సెన్సెక్స్ ఆ ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ఒక దశలో దాదాపు 350 పాయింట్లు లాభపడి 81 వేల మార్క్‌ను కూడా క్రాస్ చేసింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 190 పాయింట్ల లాభంతో 80, 978 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 54 పాయింట్ల లాభంతో 24, 827 వద్ద కొనసాగుతోంది.


సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్, టాటా ఎలాక్సి, గ్లెన్‌మార్క్, విప్రో, పీబీ ఫిన్‌టెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పేటీఎమ్, సీజీ పవర్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, సీజీ కన్స్యూమర్, డెలివరీ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 32 పాయింట్ల స్వల్ప నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.07గా ఉంది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 09 , 2025 | 10:29 AM