Home » Sports news
ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2025లో సౌతాఫ్రికా మహిళా ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్స్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తోంది. న్యూజిలాండ్‌పై టాజ్మిన్ బ్రెట్స్ భారీ శతకం సాధించింది. గత 6 వన్డేల్లో 4 సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉంది.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేసిన చిన్న తప్పిదంతోనే రనౌట్ గా జైశ్వాల్ 175 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. అలా ఎవ్వరూ ఊహించని విధంగా తృటిలో డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇన్నింగ్స్‌లో 92వ ఓవర్‌ను జైదెన్ సీలెస్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ రెండో బంతిని యశస్వి మిడాఫ్ వైపు కొట్టాడు..
ఐపీఎల్ 2026 వేలం ముంబైలో జరగనున్నట్లు సమాచారం. అయితే దీని గురించి ఐపీఎల్ నిర్వాహకులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఐపీఎల్ 2026 వేలం జరగనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈసారి చెన్నై సూపర్ కింగ్ పలువురు ఆటగాళ్లను వదులుకోనుంది.
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనతను సాధించింది. ప్రముఖ బ్యాటర్ మిథాలీ రాజ్‌ను అధిగమించి, మహిళల వన్డేల్లో భారత్ తరఫున రెండో అత్యధిక క్యాచ్‌లు పట్టిన క్రికెటర్‌గా నిలిచింది.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ సెప్టెంబర్ అవార్డు కోసం పలువురు భారత క్రికెటర్లు పోటీలో నిలిచారు. వారిలో పురుషుల విభాగంలో యువ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్ ఉండగా, మహిళల విభాగంలో స్మృతి మంధాన నిలిచింది.
అమెరికాలో చెక్‌మేట్ ఇండియా వర్సెస్ యూఎస్ఏ ఎగ్జిబిషన్ చెస్ ఈవెంట్లో ఆదివారం చోటు చేసుకున్న ఓ సంఘటన చర్చనీయాంశంగా మారింది. అమెరికా గ్రాండ్‌మాస్టర్ హికారు నకమురా, భారత యువ వరల్డ్ చెస్ ఛాంపియన్ డి.గుకేష్ పై విజయం సాధించాడు. ఆ క్రమంలో ఆట ముగిసిన వెంటనే నకమురా రాజు (కింగ్) పీస్‌ను జనాల్లోకి విసిరాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో, టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, భారత్‌ను 50 ఓవర్లలో 247 పరుగులకు కట్టడి చేసింది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రస్తుతం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రేమదాస మైదానంలో జరుగుతున్న మ్యాచులో భారత జట్టు స్లోగా ఆడుతోంది. ప్రస్తుతం వర్షం కారణంగా ఆటకు బ్రేక్ ఇచ్చారు. ఇండియా 154 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భాగంగా కొలంబోలో భారత్, పాకిస్తాన్ మధ్య నేడు ఆరో మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా టాస్ గెలిచిన పాకిస్తాన్ మహిళా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన బ్యాటింగ్ ప్రతిభతో మళ్లీ మ్యాజిక్ చేశాడు. కేవలం 168 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేసి, తన కెరీర్లో ఆరో సెంచరీని సాధించాడు.