Share News

Bumrah - Axar Patel: అక్షర్‌పై బుమ్రా సరదా ట్రోలింగ్

ABN , Publish Date - Oct 27 , 2025 | 03:51 PM

ఓ కంపెనీకి చెందిన యాడ్‌లో అక్షర్ పటేల్ నటించాడు. ఆ వీడియోను చూసిన బుమ్రా.. ‘కిడ్నీ టచింగ్ యాక్టింగ్’ అని నవ్వుతున్న ఎమోజీలను పెట్టాడు. దానికి రియాక్ట్ అయిన అక్షర్.. ‘థాంక్స్ బ్రో. వచ్చేసారి నా యాక్టింగ్ నీ మునివేళ్లను తాకేలా ఉంటుంది’ అని సమాధానం ఇచ్చాడు. ఈ సంభాషణ కూడా నెట్టింట వైరల్‌గా మారింది.

Bumrah - Axar Patel: అక్షర్‌పై బుమ్రా సరదా ట్రోలింగ్

టీమిండియా(Team India) ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇప్పటికే మూడు వన్డేల(ODI) సిరీస్ ముగిసింది. ఇందులో ఆతిధ్య జట్టు ఆసీస్ 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. అయితే బుధవారం నుంచి ఆసీస్‌తోనే ఐదు టీ20(T20)ల సిరీస్ మొదలు కానుంది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్‌(Axar patel)కు సంబంధించిన ప్రమోషనల్ వీడియో ఒకటి నెట్టింట(Social Media) వైరల్ అవుతోంది. దానికి కారణం స్టార్ పేసర్ బుమ్రా(Bumrah) కామెంట్‌తో ట్రోలింగ్ చేయడమే. బుమ్రా స్పందనకు అక్షర్ కూడా సరదాగా కౌంటర్ ఇచ్చాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే?

ఓ కంపెనీకి చెందిన యాడ్‌లో అక్షర్ పటేల్ నటించాడు. ఆ వీడియోను చూసిన బుమ్రా.. ‘కిడ్నీ టచింగ్ యాక్టింగ్’ అని నవ్వుతున్న ఎమోజీలను పెట్టాడు. దానికి రియాక్ట్ అయిన అక్షర్.. ‘థాంక్స్ బ్రో. వచ్చేసారి నా యాక్టింగ్ నీ మునివేళ్లను తాకేలా ఉంటుంది’ అని సమాధానం ఇచ్చాడు. ఈ సంభాషణ కూడా నెట్టింట వైరల్‌గా మారింది.

జంపా స్థానంలో సంఘా..

భారత్‌తో ఆసీస్ ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. దీని కోసం ఆడమ్ జంపా స్థానంలో తన్వీర్ సంఘాను ఆసీస్ రీప్లేస్ చేసింది. వ్యక్తిగత కారణాలతో ఆడమ్ జంపా ఈ సిరీస్‌కు దూరం కానున్నాడు. జంపా సతీమణి హారియట్ రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం టీ20 మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1.45గంటలకు మొదలవుతాయి.

ఐదు టీ20ల సిరీస్‌ ఇలా..

* కాన్‌బెర్రా వేదికగా అక్టోబర్ 29న తొలి మ్యాచ్

* మెల్‌బోర్న్ వేదికగా అక్టోబర్ 31న రెండో మ్యాచ్‌

* హోబర్ట్ వేదికగా నవంబర్ 2న మూడో మ్యాచ్

* గోల్డ్ కోస్ట్ వేదికగా నవంబర్ 6న నాలుగో మ్యాచ్

* బ్రిస్బేన్ వేదికగా నవంబర్ 8న ఐదో టీ20

ఈ వార్తలు కూడా చదవండి..

రోహిత్ మనసును చదివిన మెజీషియన్

వేధింపుల ఘటన.. నవీ ముంబైలో భారీగా భద్రతా ఏర్పాట్లు

For More Sports News And Telugu News

Updated Date - Oct 27 , 2025 | 03:56 PM