Karun Nair: దుమ్ము లేపుతున్న కరుణ్ నాయర్.. జట్టులోకి తిరిగొస్తాడా?
ABN , Publish Date - Oct 26 , 2025 | 02:34 PM
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు కరుణ్ నాయర్‌ను జట్టు నుంచి తప్పించారు. అతడి స్థానంలో దేవదత్త్ పడిక్కల్‌కు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ తన ఫామ్‌ను తిరిగి అందుకోవడంతో నాయర్‌ను సౌతాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేస్తారేమో చూడాల్సి ఉంది.
టీమిండియా వెటరన్ ప్లేయర్ కరుణ్ నాయర్(Karun Nair) రంజీ ట్రోఫీలో(Ranji Trophy 2025) సెంచరీతో దుమ్ము లేపుతున్నాడు. భారత జట్టు(Team India)లో చోటు కోల్పోయిన కరుణ్.. ప్రస్తుతం రంజీలో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో శిమొగా వేదికగా గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో నాయర్ శతక్కొట్టాడు. 65 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కర్ణాటకను నాయర్ తన సెంచరీతో ఆదుకున్నాడు. తొలుత అభినవ్ మనోహర్‌తో భాగస్వామ్యం నెలకొల్పిన కరుణ్.. తర్వాత శ్రేయస్ గోపాల్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
కరుణ్ నాయర్ ప్రస్తుతం 129 పరుగులతో తన బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అంతకుముందు సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీ చేసి సత్తా చాటాడు. కాగా ఈ మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో 95 ఓవర్లు ముగిసే సమయానికి కర్ణాటక 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.
నాయర్ జట్టులోకి తిరిగొస్తాడా?
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ గడ్డపై తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడి కేవలం 205 పరుగుల మాత్రమే చేసి నిరాశపర్చాడు. భారత బ్యాటర్లు సెంచరీల మోత మోగించిన చోట.. నాయర్ కనీసం ఒక్కసారి కూడా మూడంకెల స్కోర్ సాధించకపోవడం సెలక్టర్లను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు కరుణ్ నాయర్‌ను జట్టు నుంచి తప్పించారు. అతడి స్థానంలో దేవదత్త్ పడిక్కల్‌కు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ తన ఫామ్‌ను తిరిగి అందుకోవడంతో నాయర్‌ను సౌతాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేస్తారేమో చూడాల్సి ఉంది.
Also Read:
Tea Stain Removal Tips: టీ కప్పులపై మొండి మరకలు.. ఈ హోం ట్రిక్‌తో మాయం.!
Train Viral Video: ఫ్లాట్‌పామ్‌పై యువకుడి రీల్స్.. రైలు డ్రైవర్ ఎలా షాకిచ్చాడో చూస్తే..