IND vs BAN: టాస్ గెలిచిన భారత్.. మ్యాచ్ 43 ఓవర్లకు కుదింపు
ABN , Publish Date - Oct 26 , 2025 | 05:33 PM
మహిళల వన్డే ప్రపంచకప్ 2025(India vs Bangladesh women)లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా(Team India) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025(India vs Bangladesh women)లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా(Team India) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా 8 వన్డేల తర్వాత టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచింది. వర్షం(Rain) అంతరాయం కలిగించడంతో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. పవర్ ప్లే 9 ఓవర్లు ఉండనుంది.
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో ఇప్పటికే సెమీ ఫైనల్‌కు అర్హత సాధించిన టీమిండియా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు టాస్ వేయాల్సి ఉంది. వర్షం కారణంగా 35 నిమిషాలు ఆలస్యమైంది. 3.25 గంటలకు మ్యాచ్ మొదలు కావాల్సి ఉండగా ఇంతలోనే మళ్లీ వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ ఉమా ఛెత్రి భారత్ తరఫున అరంగేట్రం చేస్తోంది. ఆమె స్మృతి మంధాన చేతుల మీదుగా క్యాప్ అందుకుంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో గాయపడిన కీపర్ రిచా ఘోష్‌కు విశ్రాంతి ఇవ్వడంతో 23 ఏళ్ల ఉమాకు అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. మరోవైపు క్రాంతి గౌడ్, స్నేహ్ రాణాకు కూడా రెస్ట్ ఇచ్చారు. వారి స్థానాల్లో రాధా యాదవ్, అమన్ జ్యోత్ కౌర్ తుది జట్టులోకి వచ్చారు.
భారత్ తుది జట్టు: ప్రతీక రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, ఉమా ఛెత్రి (వికెట్‌కీపర్), అమన్‌జ్యోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా సింగ్
బంగ్లాదేశ్ తుది జట్టు: సుమైనా అక్తర్, రుబ్యా హైదర్ జెలిక్, షర్మిన్ అక్తర్, శోభనా మోస్తరీ, నిగర్ సుల్తానా (కెప్టెన్, వికెట్‌కీపర్), షోర్నా అక్తర్, రీతు మోని, రబెయా ఖాన్, నహిదా అక్తర్, నిషితా అక్తర్ నిషి, మారుఫా అక్తర్.
Also Read:
మొంథా తుఫాను ఎఫెక్ట్.. ఏపీఈపీడీసీఎల్ అప్రమత్తం
7th సెన్స్ విలన్ గుర్తున్నాడా? ఇప్పుడిలా అయిపోయాడేంటి?