Villain From 7th Sense: 7th సెన్స్ విలన్ గుర్తున్నాడా? ఇప్పుడిలా అయిపోయాడేంటి?
ABN , Publish Date - Oct 26 , 2025 | 05:11 PM
జానీ త్రి గ్యూయెన్ పూరీ జగన్నాథ్ ఆస్థాన నటుడు. రామ్ చరణ్ డెబ్యూ సినిమా ‘చిరుత’తో భారత చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో ఏక్ నిరంజన్, బిజినెస్‌మ్యాన్, ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో నటించాడు.
సూర్య హీరోగా నటించిన సెవెన్త్ సెన్స్ సినిమా మీరు చూసే ఉంటారు. ఆ సినిమాలో విలన్ డాంగ్లీ పాత్ర చాలా వాయిలెంట్‌గా ఉంటుంది. డాంగ్లీ(7th Sense Villain Dong Lee) ఆ సినిమాలో జనాలను తన కంటి చూపుతో కంట్రోల్ చేసి తనకు కావాల్సింది చేయించుకుంటూ ఉంటాడు. దారుణంగా చంపేస్తుంటాడు. డాంగ్లీ పాత్రలో క్రూరత్వాన్ని పండించిన ఆ నటుడి పేరు జానీ త్రి గ్యూయెన్. వియత్నాం మూలాలు ఉన్న అమెరికా వ్యక్తి. జానీ త్రి గ్యూయెన్ మార్షియల్ ఆర్ట్స్‌లో నైపుణ్యం సంపాదించాడు. 2002లో విడుదలైన ‘వి వర్ సోల్జర్స్’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు.

జానీ త్రి గ్యూయెన్ (Actor Johnny Tri Nguyen) పూరీ జగన్నాథ్ ఆస్థాన నటుడు. రామ్ చరణ్ డెబ్యూ సినిమా ‘చిరుత’తో భారత చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో ఏక్ నిరంజన్, బిజినెస్‌మ్యాన్, ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో నటించాడు. సెవెన్త్ సెన్స్ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015లో విడుదలైన ‘ఇరుంబు కుదిరై’ సినిమా తర్వాత తమిళ చిత్ర పరిశ్రమకు దూరం అయ్యాడు. తెలుగులో చివరగా ‘డబుల్ ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో కనిపించాడు.

జానీ త్రి గ్యూయెన్‌కు సినిమా అవకాశాలు పెద్దగా లేవు. 2020 నుంచి 2024 వరకు ఆయన కేవలం రెండు సినిమాలు మాత్రమే చేశాడు. కేవలం నటుడిగానే కాదు యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా కూడా ఆయన సినిమాలు చేశాడు. హాలీవుడ్‌లో పలు సినిమాలకు స్టంట్స్‌తో పాటు స్టంట్ డబుల్‌గా కూడా చేశాడు. సెవెన్త్ సెన్స్ తర్వాత అంత గుర్తింపు వచ్చే పాత్ర ఒక్కటి కూడా రాలేదు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఫొటోలు (Dong Lee Viral Photos) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలు చూస్తున్న నెటిజన్లు ‘సెవెన్త్ సెన్స్ విలన్ ఎంతలా మారిపోయాడు’ అంటూ కామెంట్లు చేస్తు్న్నారు.
ఇవి కూడా చదవండి
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
ఈ గుణాలు ఉన్నవారిని అందరూ ఇష్టపడతారు!