Shreyas Iyer-BCCI: శ్రేయస్ గాయంపై బీసీసీఐ అప్‌డేట్!
ABN , Publish Date - Oct 27 , 2025 | 04:33 PM
ఫీల్డింగ్ చేస్తుండగా భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా అతడిని ఐసీయూలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. అంతర్గతంగా రక్తస్రావం కావడంతోనే మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా స్పందించింది. శ్రేయస్ గాయం పరిస్థితిపై అప్‌డేట్ ఇచ్చింది.
సిడ్నీ(Sydney) వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. అయితే ఫీల్డింగ్ చేస్తుండగా భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ అందుకొనే క్రమంలో బలంగా నేలను తాకాడు. దీంతో అతడి పక్కటెముకకు తీవ్ర గాయమైంది. వెంటనే మైదానం వీడిన అతడిని బీసీసీఐ(BCCI) వైద్యబృందం ఆసుపత్రికి తరలించింది. అయితే, తాజాగా అతడిని ఐసీయూ(ICU)లో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. అంతర్గతంగా రక్తస్రావం కావడంతోనే మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా స్పందించింది. శ్రేయస్ గాయం పరిస్థితిపై అప్‌డేట్ ఇచ్చింది.
‘ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా శనివారం జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. అతని ఎడమ పక్కటెముకల్లో గాయమైంది. టెస్ట్‌ల కోసం అతన్ని ఆసుప్రతిలో చేర్చాం. స్కాన్స్‌లో ప్లీహానికి చీలిక గాయమైనట్లు తేలింది. ప్రస్తుతం అతనికి చికిత్స అందుతోంది. వైద్యపరంగా అయ్యర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. గాయం నుంచి కోలుకుంటున్నాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతడిని పర్యవేక్షిస్తోంది. టీమిండియా డాక్టర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి సిడ్నీలోనే ఉండనున్నాడు’ అని బీసీసీఐ సోమవారం సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరం!
ప్లీహం అనేది ఎడమ పక్కటెముకల కింద ఉండే చిన్న అవయవం. అంతర్గతంగా రక్తస్రావం కావడంతో శ్రేయస్‌ను ఐసీయూలో చేర్చారనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయ్యర్ ఆరు వారాల వరకు ఆటకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల శ్రేయస్ సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే శ్రేయస్ అయ్యర్‌ను దురదృష్టం వెంటాడుతోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబర్చి టీమిండియా వన్డే వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న శ్రేయస్ అయ్యర్.. అంతలోనే గాయం బారిన పడ్డాడని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రోహిత్ మనసును చదివిన మెజీషియన్
వేధింపుల ఘటన.. నవీ ముంబైలో భారీగా భద్రతా ఏర్పాట్లు
For More Sports News And Telugu News