Share News

New Wide Ball Rule: క్రికెట్‌లో కొత్త రూల్.. వైడ్ బాల్స్‌పై కీలక మార్పు

ABN , Publish Date - Oct 24 , 2025 | 06:30 PM

క్రికెట్‌లో ఐసీసీ ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూనే ఉంటుంది. తాజాగా వైడ్ బాల్ నియమంలో ఓ కీలక మార్పు తీసుకొచ్చింది. దీని ప్రకారం లెగ్ సైడ్ వైపు వెళ్లే ప్రతి బంతి ఇప్పుడు వైడ్‌గా కౌంట్ అవ్వదు.

New Wide Ball Rule: క్రికెట్‌లో కొత్త రూల్.. వైడ్ బాల్స్‌పై కీలక మార్పు
Wide Ball Rule (File Photo)

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: క్రికెట్‌లో ఐసీసీ(ICC) ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూనే ఉంటుంది. తాజాగా వైడ్ బాల్(Wide Ball) నియమంలో ఓ కీలక మార్పు తీసుకొచ్చింది. దీని ప్రకారం లెగ్ సైడ్ వైపు వెళ్లే ప్రతి బంతి ఇప్పుడు వైడ్‌గా కౌంట్ అవ్వదు. ఇది బౌలర్లకు కాస్త కలిసొచ్చే అంశం.

క్రికెట్ ఫార్మాట్‌లో వైడ్ బాల్ అనేది బౌలర్లను ఇబ్బంది పెడుతూనే ఉండేది. ముఖ్యంగా లెగ్ సైడ్ బయటకు వెళ్లే బంతులు చాలా వరకు వైడ్ ఇచ్చేవారు. గతంలో బ్యాటర్ ఆఫ్ స్టంప్‌నకు వెలుపల ఉండేలా ఓ గైడ్‌లైన్ ఉండేది. దాని ప్రకారం అంపైర్(Umpire) వైడ్ ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటి గైడ్‌లైన్ బ్యాటర్ లెగ్ సైడ్ కూడా ఏర్పాటు చేశారు. బంతి లెగ్ సైడ్ గైడ్‌లైన్ లోపల ఉంటే అది వైడ్ అవ్వదు. బ్యాటర్ క్రీజ్‌లో కదులుతూ బౌలర్‌ను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేసినప్పుడు, బౌలర్ విసిరిన బంతి లెగ్ సైడ్ వైడ్ అవుతుండేది. ఈ కొత్త నియమం ద్వారా బౌలర్‌లు అలాంటి వైడ్ బాల్స్ నుంచి కాస్త ఉపశమనం పొందనున్నారు.


మరోవైపు బౌండరీ వద్ద క్యాచ్‌లు పట్టే విషయంలోనూ ఐసీసీ పలు మార్పులు చేసింది. ఫీల్డర్ బౌండరీ వెలుపల ఉండి బాల్‌ను పట్టుకుంటే ఆ క్యాచ్ చెల్లదు. ఫీల్డర్ బౌండరీ వెలుపల ఉన్నప్పటికీ బంతిని ఒకసారి మాత్రమే గాల్లో ఉంచి ఆ తరువాత లోపలికి వచ్చి క్యాచ్ అందుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియలో బంతితో ఫీల్డర్ శరీరానికి రెండోసారి తాకితే అది బౌండరీగా పరిగణిస్తారు. ఈ మార్పు ద్వారా క్యాచ్‌లు పట్టడంలో క్లారిటీ పెరుగుతుంది.


Also Read:

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

Kurnool Bus Accident: కర్నూలు బ‌స్సు ప్ర‌మాదం.. తల్లీకూతురు మృతి

Updated Date - Oct 24 , 2025 | 06:41 PM